ధనప్రాప్తి కలగడానికి పొద్దున లేచిన వెంటనే వీటిని చూడండి

First Published | Dec 3, 2023, 7:15 AM IST

ఉదయం నిద్రలేవగానే కొన్నింటి చూడటం వల్ల మీకు అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జీవితంలో అదృష్టం, సంపదను పొందుతారు. ప్రతి పనిలో పురోగతి పొందుతారు. మరి పొద్దున్నే లేవగానే ఏం చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఉదయాన్నే మీ అరచేతులను చూడటం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఉంది. ఉదయాన్నే అరచేతులను చూడటం శుభ శకునానికి, అదృష్టానికి సంకేతమంటున్నారు జ్యోతిష్యులు. అందుకే ఉదయాన్నే మీ అరచేతులను చూడండి. 
 

పాలు లేదా పెరుగు

ఉదయాన్నే నిద్రలేచి పాలు, పెరుగు వంటి తెల్లని వస్తువులను చూడటం కూడా శుభమేనంటున్నారు జ్యోతిష్యులు. ఎందుకంటే ఈ రెండు వస్తువులను ఉదయాన్నే చూడటం వల్ల మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రెండూ స్వచ్ఛతకు చిహ్నాలు కూడా.
 


ఆహ్లాదకరమైన శబ్దాలు

ఉదయాన్నే పక్షలు శబ్దాలను వినడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీకు ప్రశాంతతను కలిగించే శబ్దాలను వింటే కూడా మంచిదే. కానీ ఏడుపులు, కేకలు, కొట్లాటల శబ్దానికి మేల్కొంటే ఆ రోజంతా మీరు మూడీగా, కోపంగా ఉంటారు. వీటికి బదులుగా శంఖం లేదా గంట శబ్దం వినడం మంచిది. 
 

చెరకు

చెరకును శుభసూచకంగా భావిస్తారు. అందుకే చెరుకును తులసి పూజ, ఇతర శుభకార్యాల సమయంలో ఉపయోగిస్తారు. చెరుకు లక్ష్మీ, విష్ణువులకు ఎంతో ఇష్టమట. అయితే ఉదయాన్నే మీరు లేచిన వెంటనే చెరుకు చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
 

owle

గుడ్లగూబ

కొన్ని చోట్ల గుడ్లగూబను శుభసూచకంగా భావిస్తారు. దీన్ని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని కూడా చెప్తుంటారు. అయితే ఇంకొన్ని చోట్ల గుడ్లగూబలను అశుభంగా భావిస్తారు. ఉదయం నిద్రలేవగానే లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబను చూడటం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

సుమంగళి

ఏదైనా ముఖ్యమైన పనిమీద ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆ సమయంలో ఎరుపు రంగు చీరతో అలంకరించిన సుమంగళిని  చూస్తే మీరు చేసే పనిలో విజయం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Latest Videos

click me!