చిన్న హాల్స్ ఉన్న ఇళ్లు ఎక్కువగానే ఉంటాయి. అలా చిన్న లివింగ్ రూమ్ కు ఈ టీవీ యూనిట్లు బావుంటాయి. ఇక్కడ ఇచ్చిన వుడెన్ వర్టికల్ స్లాట్ టీవీ యూనిట్ ఎడమ వైపు నిలువుగా చెక్క పట్టీలు అమర్చారు. ఇవి సింపుల్‌గా ఉన్నా మోడ్రన్ లుక్ ఇస్తాయి. కింద భాగంలో అదే చెక్కతో డ్రాలు ఉన్నాయి. అక్కడ మీరు సెటప్ బాక్స్, మీడియా ప్లేయర్ వంటివి పెట్టుకోవచ్చు.
మినిమల్ డిజైన్ టీవీ యూనిట్
హాల్ గోడలకు న్యూడ్ న్యూట్రల్ పెయింట్ వేసుంటే ఈ మినిమలిస్ట్ ఆల్-వైట్ ఫ్లోటింగ్ టీవీ యూనిట్ బెస్ట్ ఛాయిస్. దీని కింద పొడవైన, మూడు లేయర్ల ఓపెన్ షెల్ఫ్ ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన వస్తువులు పెట్టుకోవచ్చు. ఇలాంటి యూనిట్లు 32-50 అంగుళాల టీవీలకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.
డ్యూయల్ టోన్ టీవీ ప్యానెల్ యూనిట్
వాల్ మౌంటెడ్ లుక్ కావాలనుకుంటే ఈ డ్యూయల్ టోన్ టీవీ ప్యానెల్‌ను తీసుకోవచ్చు. ఇందులో బోర్డ్ వుడెన్ ప్యానెల్‌తో డిజైన్ చేశారు. దీనికి కాంట్రాస్ట్‌గా ఉన్న వైట్ డ్రాలు లగ్జరీ ఫీల్‌ను ఇస్తాయి.