రుతుపవనాల రాకతో మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించింది. ఇది సంతోషకరమైన విషయమే కానీ.. కానీ ఈ సీజన్ లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూ, జ్వరం, దగ్గు వంటి సమస్యల బారిన చాలా మంది పడుతుంటారు. ఎందుకంటే సీజన్ల మార్పు శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతుంది.
26
అందుకే మారిన వాతావరణానికి తగ్గట్టు తగు ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే ఈ సీజన్ లో కామన్ గా వచ్చే జలుబు, ప్లూ సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే వీటి నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
36
Soup
సూప్ (Soup)
ఫ్లూతో బాధపడేవారు సూప్ ను తాగితే మంచిది. వేడి వేడిగా.. రుచిగా ఉండే సూప్ ను తాగితే వచ్చే ఆనందమే వేరు. ఇది ఫ్లూ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఎన్నో విటమిన్, ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇది సులువుగా కూడా జీర్ణం అవుతుంది.
46
వెల్లుల్లి (garlic)
వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔషద గుణాటుంటాయి. ఇది వేసిన వంటలు చాలా టేస్టీగా అవుతాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది ఫ్లూ, జలుబు సమస్యలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
56
కొబ్బరి నీళ్లు (coconut water)
ఫ్లూ లేదా జలుబు సమస్యలతో బాధపడేవారికి నీళ్లు అసలే తాగాలనిపించదు. ఇలాంటి సమయంలో వీరు కొబ్బరి నీళ్లను తాగితే మంచిది. ఈ నీళ్లు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. శరీరానికి నీటి అవసరాన్ని తీర్చడానికి సహాయపడుతాయి. ఎలక్ట్రోలైట్ ను భర్తీ చేయాలంటే కొబ్బరినీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఈ వాటర్ మిమ్మల్ని శక్తివంతంగా కూడా ఉంచుతాయి.
66
వీటితో పాటాగు పండ్లు, గుడ్లు, పాలు, చెకెన్, తాజా కూరగాయలు, భారతీయ మసాలా దినుసులను తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకున్నా జలుబు నుంచి తొందరగా బయటపడతాయి.