sri rama navami 2022: శ్రీరామ నవమి స్పెషల్ వంటకం.. పానకం, వడపప్పు తయారీ విధానం..

First Published | Apr 8, 2022, 3:30 PM IST

sri rama navami 2022:  శ్రీరామ నవమి అంటే మనకు ముందుగా గొర్తొచ్చేది పానకం, వడపప్పు. ఈ వంటకాలు ఆ శ్రీరామ చంద్రుడికి కూడా ఎంతో ఇష్టమట. మరి ఈ కమ్మని వంటకాలను ఎలా తయారుచేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

శ్రీరామ నవమి పండగ వస్తుందంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది కమ్మని పానకం, వడపప్పు. ఈ కమ్మటి పదార్ధాలు శ్రీ రామచంద్రుడికి ఎంతో ఇష్టం. అందుకే  శ్రీరామ నవమి రోజు అందరూ పానకం, వడపప్పును తయారుచేసి స్వామి వారికి  నైవేద్యంగా సమర్పిస్తారు. మరి అంతటి కమ్మని పదార్ధాలను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పానకం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. 
నీళ్లు   - లీటర్
బెల్లం   - 100 గ్రాములు
యాలుకలు   - నాలుగు
మిరియాలు  - నాలుగు
 

Latest Videos


తయారీ చేయు విధానం  :-

ముందుగా యాలకులపై పొట్టును తొలగించి గింజలను పౌడర్ గా తయారు చేసుకోవాలి.  తరువాత మిరియాలను కూడా పౌడర్ చేసి.. ఈ రెండింటినీ నీళ్లల్లో వేయాలి. ఆ తర్వాత ఈ నీళ్లలో బెల్లాన్ని కూడా వేయాలి. ఈ బెల్లం మొత్తం కరిగేదాక ఆ నీళ్లను బాగా కలుపుకోవాలి. అంతే కమ్మనైన పానకం రెడీ అయినట్టే.  

వడపప్పు చేయు విధానం  :-

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు  - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు  - టీ స్పూన్
కొబ్బరి తురుము  -టేబుల్ స్పూన్
ఉప్పు  - రుచికి తగినంత

తయారీ విధానం.. 

పెసరపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి.  ఆ తర్వాత నీటిని వడకట్టేసి, పప్పును ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే వడపప్పు రెడీ  అయినట్టే. 

చలిమిడి తయారీ చేయు విధానం  :- 

కావలసిన పదార్ధాలు :-

బియ్యం  - 300 గ్రాములు ( గంటసేపు నీళ్లలో నానబెట్టి, ఆరాక, పిండి చేయాలి )
మంచి నెయ్యి - ఒక కప్పు
ఇలాచి పొడి - అర టీ స్పూన్
జీడిపప్పు - 20 
ఎండుకొబ్బరి తురుము  - అర కప్పు
బెల్లం తురుము  - 150 గ్రాములు
గసగసాలు  - రెండు స్పూన్లు

తయారీ విధానం :-

స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో గసగసాలు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదేపాన్ లో కొంచెం నెయ్యి వేసి అందులో కొబ్బరి తరుగు, కట్ చేసిన జీడిపప్పు, పలుకులు బాగా వేయించుకోవాలి. తరువాత మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి మరిగించుకోవాలి. అందులో బెల్లం వేసి పాకం తయారవుతుంటే స్టవ్ సిమ్‌లో పెట్టి, బెల్లం పాకంలో బియ్యం పిండి, జీడిపప్పు, కొబ్బరి, ఇలాచి పొడి, గసగసాలు వేసి ముద్దలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక చివరగా అందులో  నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
 

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

click me!