వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ..

Published : Apr 08, 2022, 02:35 PM IST

వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం వల్ల బాగా నిద్రపట్టడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

PREV
17
వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ..

వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటేనే ఎలాంటి జబ్బు సోకదు. ఇందుకు మనం ప్రతిరోజూ మరువకుండా స్నానం చేయాలి. స్నానం చేయడం వల్ల ఒంటిమీదున్న దుమ్ముదూళి, క్రిమికీటకాలు తొలగిపోవడమే కాదు మనసు ప్రశాంతంగా మారుతుంది. దాంతో మీరు రీఫ్రెష్ గా ఉంటారు. 

27

అయితే ఈ ఎండాకాలంలో కొంతమంది ఉదయం, సాయంత్రం .. అంటూ రోజుకు రెండు మూడు స్నానం చేస్తుంటారు. దీనికి కారణం మండుతున్న ఎండలకు విపరీతమైన చెమట పుడుతుంది. ఈ చెమటతో దుర్వాసన, చికాకు వంటి సమస్యలు కలుగుతుంటాయి. అందుకే రోజుకు ఒకసారి కంటే ఎక్కువ సార్లు స్నానం చేసేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ వేసవికాలం రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

37

హాయిగా నిద్రపోతారు.. ఈ సీజన్ లో రాత్రిపూట స్నానం చేయడం వల్ల మీ బాడీ రిలాక్స్ అవుతుంది. అంతేకాదు మీరు హాయిగా నిద్రపోతారు కూడా. రోగనిరోధక శక్తికూడా పెరుగుతుంది. 

47

రక్తపోటు నియంత్రణ.. రాత్రిపూట స్నానం చేయడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందన్న విషయం మీకు తెలుసా..? అవును అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

57

బరువు తగ్గుతారు.. చల్లని లేదా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల మన ఒంట్లో కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో మీరు వెయిట్ లాస్ అవుతారు. కానీ చర్మాన్ని దెబ్బతీసే విధంగా నీళ్లు వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉండేట్టు చూసుకోవాలి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ప్రతిరోజూ రాత్రిపూట స్నానం చేయండి. 

67

రక్తప్రసరణ పెరుగుతుంది.. రాత్రిపూట గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల  రక్తప్రసరణ (Blood circulation) మెరుగుపడుతుంది. అలసట కూడా దూరమవుతుంది. దీంతో మీరు వెంటనే నిద్రలోకి జారుకుంటారు. 

77

చర్మ సమస్యలు దూరమవుతాయి.. ఎలాంటి చర్మ సమస్యలైనా తొందరగా తగ్గాలనుకుంటే మాత్రం ప్రతిరోజూ రాత్రిపూట స్నానం చేయండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట స్నానం చేయడం వల్ల డ్రై స్కిన్, మొటిమలు, చర్మం గరుకుతనం వంటి స్కిన్ కు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు మీ స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది కూడా. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బయటకు వెళ్లి వచ్చినప్పుడు తప్పకుండా ముఖం కడగాలి. లేదంటే ముఖంపై దుమ్ము దూళి పేరుకుపోయి ఫేస్ జిడ్డుగా మారుతుంది.

click me!

Recommended Stories