1. ముందుగా బోటిని చాలా శుభ్రంగా కడగాలి. ఇదే చాలా ముఖ్యమైన పని.
2. బోటీని ఒక గిన్నెలో వేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా రుద్దాలి. అప్పుడు వాసన పోతుంది.
3. ప్రెషర్ కుక్కర్‌లో బోటిని కొద్దిగా నీరు వేసి 3–4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ వేసి వేయించాలి.
5. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
6. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన బోటి ముక్కలు వేసి వేయించాలి.
7. దీని వల్ల మసాలా బాగా ముక్కలకు పట్టి కర్రీ రుచిగా వస్తుంది.
8. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
9. తరువాత టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి.
10. గ్రేవీ కోసం అవసరమైతే కొద్దిగా నీరు వేసి కుక్కర్‌లో మళ్లీ 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
11. చివరగా గరం మసాలా వేసి కలిపి పైన కొత్తిమీరను చల్లాలి. అంతే టేస్టీ బోటీ మసాల కూర సిద్ధమైనట్టే.