ఈ తప్పులు చేయకండి...
అయితే, పాములు ఇంట్లోకి రాకుండా ఉండటానికి మనం కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పాములు తరచుగా కనిపిస్తుంటే, వెంటనే... ఇంటి మూలలను శుభ్రం చేయండి. అంటే.. పాములు దాక్కునేలా చెత్త, పనికిరాని వస్తువులు లాంటివి ఉంచకూడదు. ఇక.. మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే.. మీ ఇంటి చుట్టు పక్కల ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటి చుట్టూ గట్టి పెరగకుండా జాగ్రత్త పడాలి. గడ్డి ఎక్కువగా ఉంటే పాము తొందరగా కనిపించదు. ఇది పాము కాటుకు దారితీసే అవకాశం ఉంది.
ఈ మొక్కలు పెంచకండి..
కొన్ని మొక్కలకు ఒక ప్రత్యేకమైన వాసన, స్వభావం ఉంటాయి. అవి పాములను మీ ఇంటికి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. అడవి తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే సరిపోతుంది. అడవి తులసికి ఘాటైన వాసన ఉంటుంది. ఇది పాములకు అసౌకర్యాన్ని కలిగించి, అవి మీ ఇంటి దగ్గరకు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ మొక్కను మీరు మీ ఇంట్లో పెంచుకుంటే సరిపోతుంది.
దీని కోసం మీరు అడవి తులసి ఆకులను సేకరించి, చిన్న గుడ్డ ముక్కలలో చుట్టి, పాములు ప్రవేశించే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఉంచాలి. ఈ వాసన పాములను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.