Gongura Pachadi: ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే గోంగూర పచ్చడి.. ఎలా చేయాలో తెలుసా?

Published : Nov 25, 2026, 05:59 PM IST

Gongura Pachadi: గోంగూర పచ్చడిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. పుల్లపుల్లని రుచి, కారం ఘాటు, తాలింపు సువాసన కలిస్తే ఆ టేస్ట్ వర్ణించడం కూడా కష్టమే. మరి అలాంటి నోరూరించే గోంగూర పచ్చడిని ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
గోంగూర పచ్చడి రెసిపీ

గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఎప్పుడూ ఆకుకూర పప్పు చేసుకునే వారికి, గోంగూర పచ్చడి ఒక మంచి ప్రత్యామ్నాయం. గోంగూరలోని సహజసిద్ధమైన పులుపునకు వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి కారం తోడైతే పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది. మరి తక్కువ టైంలో ఇంట్లోనే ఈజీగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

25
గోంగూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

వేయించుకోవడానికి:

గోంగూర - 2 కప్పులు

పచ్చిశనగపప్పు - 1 టేబుల్ స్పూన్

మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్

జీలకర్ర - 1 టీస్పూన్

ఎండుమిర్చి - 4

పచ్చిమిర్చి - 2

వెల్లుల్లి రెబ్బలు - 6

చిన్న ఉల్లిపాయలు - 10

చింతపండు - చిన్న ఉసిరికాయంత

పసుపు - 1/4 టీస్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

నువ్వుల నూనె లేదా పల్లి నూనె - 3 టేబుల్ స్పూన్లు

తాలింపు కోసం:

నూనె - 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు - 1/2 టీస్పూన్

మినప్పప్పు - 1/2 టీస్పూన్

ఎండుమిర్చి - 2

వెల్లుల్లి రెబ్బలు - 3

కరివేపాకు - కొద్దిగా

35
గోంగూర పచ్చడి తయారీ విధానం

ముందుగా గోంగూరను కాడలు లేకుండా ఆకులు మాత్రమే తుంచుకోవాలి. నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీరు లేకుండా జల్లెడలో వడగట్టి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మంట తగ్గించి దోరగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారి, వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి.

45
గోంగూరను వేయించడం

తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను కడాయిలో వేయాలి. అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి బాగా కలపాలి. ఆకుకూర మగ్గి, అందులోని తేమ తగ్గేంత వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలపాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి.

55
మిక్సీ పట్టడం

చల్లారిన గోంగూర, మసాలా మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి. నీరు పోయకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. పచ్చడి ముద్దగా ఉండాలి కాబట్టి నీరు కలపకపోవడమే మంచిది.

తాలింపు వేయడం

ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసి బాగా కలపాలి. అంతే.. కారం కారంగా, పుల్ల పుల్లగా ఉండే రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని, కాస్త నెయ్యి కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories