మన కళ్ల గురించి మనకే తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

First Published | Nov 2, 2023, 4:33 PM IST

ఒక వ్యక్తిలో మనం ముందుగా చూసేది వారి ముఖాన్నే. ముఖంలో ముందుగా కనిపించేవి వారి కళ్లే. అవును మరి మన ముఖానికి కళ్లే అందం. అందుకే కదా అందమైన కళ్ల గురించి ఎన్నో పాటలు రాసారు. ఎంతో పొగుడుతుంటారు కవులు. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి హావభావాలను అతని కళ్ల ద్వారే తెలుసుకోవచ్చు. కానీ మన కళ్ల గురించి మనకే తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి తెలుసా? 
 

మానవ శరీరంలో అత్యంత అందమైన, సున్నితమైన, ఆకర్షణీయమైన భాగాల్లో కళ్లు ఒకటి. కళ్లతో ఈ లోకాన్ని చూస్తున్నాం. కానీ అసలు ఇవి ఎలా పనిచేస్తాయనే ముచ్చట మనలో ఎంతమందికి తెలుసు? మనం ప్రతిరోజూ  వీటిమీదే ఆధారపడతాం. ఇవి లేకుండా ఏ పనీ చేయలేం. కళ్లు లేని వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ కళ్లు లేని జీవితం ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించండి. ఈ సంగతి పక్కన పెడితే మన కళ్ల గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 
 

1.  కొందరి అభిప్రాయం ప్రకారం.. కళ్లు ముందుగా అంటే 550 మిలియన్ సంవత్సరాల కిందట జంతువులలోనే అభివృద్ధి చెందాయి. 

2. మన కళ్లు కూడా అచ్చం కెమెరా లాగే పనిచేస్తాయి తెలుసా? ఇవి కాంతిని సంగ్రహిస్తాయి. అలాగే ఈ డేటాను మన మెదడుకు తిరిగి పంపుతాయి.

3. మనం చాలా వస్తువులను తలకిందులుగా చూస్తాం. కానీ మన మెదడు దాన్ని సరైన మార్గంలోకి తిప్పుతుంది.

3. జస్ట్ మనం ఒక్క సెకనులో ఐదుసార్లు రెప్పలు కొట్టగలం. 

4. మనం మాట్లాడుతున్నప్పుడే ఎక్కువ సార్లు రెప్పలు కొడతాం. 


5. మన శరీరంలోని అత్యంత వేగవంతమైన కండరం కన్ను. అందుకే ఏదైనా సంఘటన అప్పటికప్పుడే జరిగినప్పుడు..  మనం 'కంటి రెప్పపాటులో' జరిగిపోయిందని అంటుంటాం. 

6. మీకు తెలుసా? సాధారణంగా రెప్పపాటు 100-150 మిల్లీసెకన్లు ఉంటుంది.

7. మనిషి కన్ను ఎలాంటి రెస్ట్ అవసరం లేకుండా ఏ క్షణమైనా 100% పనిచేయగలుగుతుంది.

8. సగటున మనం ఒక ఏడాదిలో సుమారుగా 4,200,000 సార్లు రెప్పలు కొడతాం.

9. ప్రపంచంలో అత్యంత సాధారణ కంటి రంగు గోధుమ.

10. మొదటి నీలి కళ్ల వ్యక్తి 6,000-10,000 సంవత్సరాల కిందట జీవించాడని చెబుతారు.

Eyes

11. కంటి పరీక్షతో డయాబెటిస్, అధిక రక్తపోటుతో పాటుగా ఎన్నో రోగాలను గుర్తించొచ్చు. 

12. యూకే లో పెద్దవారిలో అంధత్వానికి డయాబెటిస్ యే ప్రధాన కారణమట.

13. చాలా గట్టిగా కట్టిన టై పురుషులలో గ్లాకోమా ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.

14 మీకు తెలుసా మన చెవులు, ముక్కు మన జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కానీ మన కళ్లు మాత్రం పుట్టినప్పటి నుంచి ఒకే పరిమాణంలో ఉంటాయి.
 

Eyes

15. పుట్టినప్పుడు పిల్లలందరూ రంగు అంధులు.

16 ఆడవారితో పోలిస్తే పురుషుల్లో కలర్ బ్లైండ్ నెస్ ఎక్కువగా ఉంటుందట. 

17. మీరు ఎప్పుడైనా గమనించారా? అప్పుడే నవజాత శిశువులు ఏడుస్తారు. కానీ కంటిలో నుంచి నీరు మాత్రం రాదు. పిల్లలకు ఆరు వారాల వయస్సు వచ్చే కన్నీళ్లు ఉత్పత్తి కావట. 

18. నవజాత శిశువులు 8-15 అంగుళాల దూరంలో ఉన్న ఎలాంటి వస్తువులనైనా చాలా క్లియర్ గా చూడగలుగుతారు. 

19 మరొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే? మన వయసు పెరిగే కొద్దీ కన్నీళ్లు రావడం తగ్గుతాయి. 

Latest Videos

click me!