ఈ వస్తువులను ఇట్లో నుంచి పారేయండి
దీపావళికి ముందే మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువును బయట పారేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. విరిగిన, పనికిరాని వస్తువులను దీపావళికి మీ ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో నుంచి తీసేయండి. ఎందుకంటే ఇవి ఇంట్లో ఉండటం శుభప్రదం కాదు. వీటితో పాటుగా విరిగిన దేవుళ్ల విగ్రహాలను కూడా ఇంట్లో పెట్టకూడదు. అయితే వీటిని పవిత్రమైన నదిలోనే నిమజ్జనం చేయండి.