డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే ఇలా చేయండి..

First Published Nov 24, 2022, 10:41 AM IST

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డెలివరీ తర్వాత ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు పౌష్టికాహారం ఎంతో సహాయపడుతుంది. అలాగే క్రమం తప్పకుండా నడిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు. 
 

weight loss

కడుపుతో ఉన్నప్పుడు ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంది ఆడవారు బరువు బాగా పెరిగిపోతుంటారు. కానీ డెలివరీ తర్వాత బరువు తగ్గడం అంత సులువు కాదు. అందులోనూ ఇలాంటి సమయంలో  జిమ్ కు వెళ్లడానికి, బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేయడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే బిడ్డతోనే ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు మన జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకుంటే సరిపోతుందంటున్నారు. 

weight loss

పౌష్టికాహారాన్ని తింటే కూడా  ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా నడవాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత బరువు తగ్గడం ప్రారంభించడానికి సరళమైన, ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా నడవడం, నెమ్మదిగా పరిగెత్తడం.

weight loss

బరువు తగ్గడానికి మొదట్లో నెమ్మదిగా నడవాలి. కొన్ని రోజులైన తర్వాత కొంచెం వేగంగా నడవవాలి. ఆ తర్వాత జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్  వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. వీటి వల్ల కొన్ని వారాల్లోనే మీరు బరువు తగ్గడాన్ని గమనిస్తారు. నిజానికి వ్యాయామాలు కేవలం బరువు తగ్గేందుకే కాదు.. మీ శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి. అందుకే ఈ సమయంలో నిపుణుల సలహా తీసుకుని వ్యాయామాలు చేయడం ప్రారంభించండి.

మీకు తెలుసా నిద్రలేమి మీ బరువును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అంటే తగినంత నిద్రపోకపోతే.. గర్భంతో ఉన్నప్పుడు ఎంత బరువు ఉన్నారో.. డెలివరీ తర్వాత కూడా అంతే బరువు ఉండే అవకాశం ఉంటుందని కొన్ని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. డెలివరీ తర్వాత సాధారణ బరువును నిర్వహించడానికి రోజుకు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. పిల్లలకు రొమ్ము పాలు ఇస్తున్నట్టైతే మీ బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది రొమ్ము పాల ఉత్పత్తితో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరంలో హైడ్రేట్ గా ఉంటేనే రొమ్ము పాలు బాగా ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కేలరీలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

మీరు తినే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇవి మీ శరీరంలో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు లోపాలను పోగొడుతాయి. అలాగే లిఫ్ట్ కు బదులుగా మెట్లను ఎక్కడం అలవాటు చేసుకోండి. మెట్లను ఎక్కడం దిగడం వల్ల కేలరీలు కరిగిపోతాయి. 2019 లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం.. పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల బరువు తగ్గుతారని వెల్లడైడంది. సో పిల్లలకు తప్పకుండా పాలివ్వండి. 

weight loss

డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి మీ శరీర బరువును అమాంతం పెంచుతాయి. తీపి పానీయాలు, ధాన్యాలను కూడా తీసుకోకండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు మీ బరువును తగ్గించడానికి బదులుగా వేగంగా పెంచుతాయి. 

click me!