Solar eclipse 2022: సూర్య గ్రహణం రోజున చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..

First Published | Apr 29, 2022, 9:38 AM IST

Solar eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్య గ్రహనం ఏప్రిల్ 30న ఏర్పడి.. మే 1 ఉదయం 4.07 గంటల వరకు కొనసాగనుంది. అయితే ఈ గ్రహణం ఏర్పడిన సమయంలో కొన్ని చేయకూడని, చేయాల్సిన పనులు ఉంటాయి. అవేంటంటే..
 

Solar eclipse 2022:  ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30 న ఏర్పనుంది. అంతేకాదు ఇదే రోజున వైశాఖక అమావాస్య కూడా ఏర్పడనుంది. సూర్య గ్రహణాలు చాలా వరకు అమావాస్య రోజునే ఏర్పడుతుంటాయి. కాగా ఈ సూర్య గ్రహణం సమయంలో సూర్యుడు చంద్రునిచే పూర్తిగా కప్పబడి ఉంటాడు. దీంతో సూర్య కిరణాలు భూమిని చేరుకోలేవు. 
 

ఇక ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మే  1 ఉదయం 4.07 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని చేయాల్సిన, చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 


చంద్రగ్రహణాలు, సూర్య గ్రహణం అశుభమైనవని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో రాశీచక్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందట. కాగా ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. 
 

గ్రహణం తర్వాత ఈ పనులు చేయండి.. 

1.సూర్యగ్రహణం సమయంలో శివుడి ఏదైనా ఒక మంత్రాన్ని జపించాలి.

2. సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లును శుభ్రపరుచుకోండి. ఈ తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లండి. దీంతో గ్రహణ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చెడు కిరణాల ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

3. గ్రహణం అయిపోయిన వెంటనే పుణ్యనదుల్లో తలస్నానం  చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇలా కుదరకపోతే ఇంట్లోనే పవిత్ర నదుల గంగాజలం ఉంటే వాటిని స్నానపు నీటిలో కలిపి స్నానం చేయండి. 

4. గ్రహణం ముగిసిన తర్వాత పేదవారికి దానం చేస్తే పుణ్యం లభిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. వీలైతే ఆవుకు పచ్చిగడ్డి తినిపించినా మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుందట. 

solar eclipse 2022


సూర్యగ్రహణం 2022 సమయంలో చేయకూడని పనులు.. 

గ్రహణం సమయంలో ఆహారాలను వండటం కానీ తినడం కానీ అస్సలు చేయకూడదు. 

గ్రహణాన్ని ఎప్పుడూ కళ్లతో చూడకూడదు. 

ముఖ్యంగా గ్రహణం సమయంలో నిద్రపోకూడదు.

సూర్యగ్రహణానికి ముందు తులసి ఆకులను నీటిలోనూ, ఆహారంలోనూ వేయాలి. 

Latest Videos

click me!