Solar eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో గర్భిణులు పొరపాటున కూడా ఈ పనులను అస్సలు చేయకూడదు..

First Published Apr 29, 2022, 10:24 AM IST

Solar eclipse 2022: జ్యోతిష్యం ప్రకారం..సూర్య, చంద్ర గ్రహణాలు అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా గ్రహణం సమయంలో గర్భిణులు కొన్ని నియమాలను తప్పకపాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రహణం ప్రభావం గర్భంలోని బిడ్డపై ఎక్కువగా ఉంటుంది. 
 

solar eclipse 2022

olar Eclipse 2022 Pregnancy Precautions: ప్రతి ఏడాది సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణం. అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం 2022 ఏప్రిల్ 30న శనివారం ఏర్పడనుంది. శనిశ్రీ అమావాస్య కూడా ఈ రోజునే వస్తుంది. అయితే జ్యోతిష్యం ప్రకారం.. ఈ గ్రహణం వ్యక్తులందరిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. 

Image: Getty Images

అందుకే గ్రహణం ప్రారంభమైన వెంటనే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పలువురు జ్యోతిష్యులు ప్రభిప్రాయం ప్రకారం.. గ్రహణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే గ్రహణం సమయంలో గర్భిణులు చేసే కొన్ని పనులు గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తాయి. దీంతో బిడ్డ శరీరక వైకల్యంతో బాధపడొచ్చు. అందుకే గర్భిణులు గ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవి తూ.చా తప్పకుండా పాటించినట్టైతే తల్లీ బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 

గర్భిణులు సూర్య గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు.. 

గర్భిణులు సూర్యగ్రహణాన్ని నగ్నంగా లేదా నేరుగా కళ్లతో చూడకూడదు. ఎందుకంటే ఆ సమయంలో సూర్యకిరణాలు సాధారణం కంటే పదునుగా ఉంటాయి. ఇవి కళ్లను దెబ్బతీస్తాయి. అంతేకాదు గర్బంలోని శిశువుపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. 

ముఖ్యంగా గ్రహణం సమయంలో గర్భిణులు ఇండ్ల నుంచి అస్సలు బయటకు రాకూకడదు. ఎందుకంకటే గ్రహణం యొక్క నీడ గర్భంలోని శిశువు చర్మాన్ని దెబ్బతీస్తుంది.

గ్రహణ  సమయంలో గర్భిణులు కత్తులు, కత్తెరలు, పిన్నులు, సూదులు వంటి పదునైన లేదా పదునైన అంచులు ఉన్న వస్తువులను ఉపయోగించకూడదు. వీటిని ఉపయోగించడం వల్ల పిల్లల శారీరక వైకల్యం ఏర్పడుతుంది. 
 

గ్రహణం సమయంలో మీరు వేటినీ తినకూడదు. తాగకూడదని కొందరు చెబుతుంటారు. కానీ గ్రహణం ఎక్కువ సేపు ఉంటే వీరు అంతసేపు ఆకలితో ఉంటడం అంత మంచిది కాదు. ముఖ్యంగా నిర్జలీకరణానికి దారితీస్తుంది. అందుకే గర్భిణులు గ్రహణం సమయంలో ఆకలేస్తే కొద్దిగా తినొచ్చు. కానీ ఎక్కువగా మాత్రం అస్సలు తినకూడదు. 
 

గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణులు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇది గ్రహణం చెబు ప్రభావాన్ని తగ్గిస్తుంది. 

సూర్య గ్రహణం టైమింగ్స్.. ఏప్రిల్ 30 న మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ఏర్పడి మే 1న ఉదయం 4.07 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2:12 గంటలకు గ్రహణం మధ్యలో ఉంటుంది. సూర్యగ్రహణం మొత్తం సమయం 3 గంటల 53 నిమిషాలు.  ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.  

click me!