Cooking Oil Reuse Ideas: ఇంట్లో వేడివేడిగా పకోడీలో, మిరపకాయబజ్జీలో, సమోసాలో తినాలనిపించి చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన నూనె నల్లగా అయిపోయిందని, పనికిరాదని పారేస్తారు. కానీ ఆ నూనెతో బోల్డెన్నీ అద్భుతాలు చేయోచ్చు. పనికిరానిదే...ఇంటి పనులకు వాడుకోవచ్చు.
ఇంట్లో బజ్జీలు, పకోడీలు, ఫిష్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ నల్లగా అయిపోతుంది. చాలా మంది ఆ మిగిలిపోయిన నూనెను బయట పారేస్తారు. నూనె నల్లగా అయిపోయిందని, జిడ్డుగా ఉందని పడేస్తారు. అలా కాకుండా కాస్త తెలివిగా ఆలోచిస్తే నల్లబడిన నూనెతోనే బోలెడన్ని అద్భుతాలు చేయోచ్చు. ఇంతకీ ఏమేం చేయోచ్చో...ఇక్కడ తెలుసుకుందాం.
25
తుప్పు వదిలించొచ్చు
ఇంట్లో ఐరన్ వస్తువులు తుప్పుపడితే పక్కన పడేస్తాం. అలా కాకుండా మిగిలిపోయిన వంట నూనెను ఉపయోగించొచ్చు. ముందుగా నూనెలో ఉండే వ్యర్థాలను వేరు చేయడానికి దానిని ఒక సన్నని జల్లెడతో వడకట్టండి. ఈ నూనెను ఒక సీసాలో నిల్వ చేసుకోండి. తుప్పుపట్టిన ఐరన్ వస్తువులను శుభ్రం చేయవలసి వచ్చినప్పుడల్లా వాటికి కొద్దిగా నూనె రాసి ఒక గుడ్డతో తుడవండి. దానివల్ల తుప్పు పట్టకుండా నివారిస్తుంది. వాటిని చాలా కాలం పాటు కొత్తగా కనిపించేలా చేస్తుంది.
కొత్త గిన్నెలు, సీసాలపై ఉండే స్టిక్కర్లు లేదా లేబుల్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఆ మరకలపై కొద్దిగా పాత నూనెను పూసి 5-10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత శుభ్రంగా తుడిస్తే స్టిక్కర్, దానికున్న జిగురు ఈజీగా పోతుంది. కష్టపడక్కర్లేదు.
ఇంట్లో ఆవనూనె మిగిలిపోతే దాన్ని పారేయకండి. పాతబడిన ఫర్నిచర్‌కు తిరిగి మెరుపును తీసుకురావడానికి ఈ మిగిలిపోయిన ఆవనూనెను ఉపయోగించవచ్చు. నూనెలో మెత్తని క్లాత్ ముంచి చెక్కపై రుద్దండి. ఇది చెక్కకు తేమను అందించి, తళతళ మెరిసేలా చేస్తుంది. ఆ తర్వాత పొడి క్లాత్‍తో తుడవడం మర్చిపోవద్దు.
55
తలుపులు శబ్ధం రాకుండా
ఇంట్లోని తలుపు లేదా కిటికీ గొళ్లేలు శబ్దం చేస్తుంటే, ఈ మిగిలిపోయిన నూనెను వాడొచ్చు. నూనెలో దూది ముంచి వాటిపై అద్దండి. శబ్దం వెంటనే ఆగిపోతుంది. బాగా పనిచేస్తాయి కూడా.