ఇలా చేస్తే.. రాత్రిపూట బాగా నిద్రపడుతుంది

First Published | Nov 9, 2024, 11:08 AM IST

నేటి కాలంలో చాలా మందికి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రి తెల్లవార్లూ నిద్రకోసం బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ జాగారం చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి రాత్రిళ్లు బాగా నిద్రపట్టాలంటే 3-2-1 నియమాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందనంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ నియమం ఏంటంటే? 

sleeping

కొంతమందికి ఇలా బెడ్ పై వాలగానే అలా నిద్ర వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం ఇలా కాదు. నిద్రకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా నిద్రే రాదు. కానీ నిద్రలేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే 3-2-1 నియమం నిద్రపోవడానికి బాగా సహాయపడుతుందని ఇంటర్నెట్ లో బాగా హల్ చల్ అవుతోంది. అసలు ఈ నియమం ఏంటి? ఇది ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నిద్ర పరిశుభ్రత ముఖ్యం

రాత్రిపూట బాగా నిద్రపట్టాలంటే మీరు ఖచ్చితంగా మంచి నిద్ర పరిశుభ్రతను పాటించాలి. ఈ నిద్ర పరిశుభ్రత నిద్ర బాగా వచ్చేలా చేయడమే కాదు.. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అలాగే శారీరక, మానసిక విధులకు మంచి విశ్రాంతి కూడా అవసరమేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటివల్ల మీ మెదడు, శరీరం రెండూ తిరిగి శక్తిని పొందుతాయి.

అదే మీరు రెస్ట్ తీసుకోలేదంటే అంటే బాగా నిద్రపోకుంటే డయాబెటీస్, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత సమస్యలు, మూడ్ స్వింగ్స్, బలహీనమైన ఇమ్యూనిటీ పవర్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. 
 


sleep

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిద్ర నాణ్యతకు, ఊపిరితిత్తుల ఆరోగ్యం మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. అంటే కంటినిండా నిద్రపోని వారికి పేలవమైన నిద్ర శ్వాస సమస్యలు వస్తాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

3-2-1 నిబంధన

3-2-1 నియమం నిద్రబాగా పోవడానికి సహాయపడుతుందని ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది. ఇది మనం నిద్రపోవడానికి ముందు తీసుకునే వాటిని పరిమితం చేస్తుంది. దీంతో మీ నిద్రనాణ్యత మెరుగుపడుతుంది. 

sleep

3-2-1 నిబంధన ఏంటంటే? 

3: నిద్రపోవడానికి ముందు గంటల ముందు మందును తాగకూడదు. 
2: పడుకోవడానికి రెండు గంటలకు ముందే భోజనం చేసేయాలి. 
1: నిద్రపోవడానికి ఒక గంట ముందు నుంచే నీళ్లను ఇతర ద్రవాలను తాగడం ఆపేయాలి. 

నిద్రపోవడానికి 3 గంటల ముందు:

మీకు తెలుసా? మందు నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి మీరు పడుకోవడానికి మూడు గంటల ముందు మందును అస్సలు తాగకూడదు. ఇది మీ శరీరానికి దానిని ప్రాసెస్ చేయడానికి సమయాన్ని  కలిగిస్తుంది. అలాగే మీ నిద్రకు అంతరాయం కలిగించే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. 
 


నిద్రపోవడానికి 2 గంటల ముందు:

నిద్రపోవడానికి ముందే తినడం మంచిది కాదు. దీనివల్ల గ్యాస్, యాసిడ్ రిఫ్లెక్స్, జీర్ణ అసౌకర్యం, రక్తంలో చక్కెర పెరుగుదల వంటి సమస్యలు వస్తాయి. ఇది మీరు రాత్రిపోకుండా చేస్తుంది. అందుకే మీరు నిద్రపోవడానికి రెండు గంటల ముందు తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు తిన్నది బాగా జీర్ణం కావడానికి మీ శరీరానికి కావాల్సిన సమయం అందుతుంది. 

నిద్రపోవడానికి 1 గంట ముందు

నిద్రపోవడానికి ఒక గంట ముందు ఎలాంటి ద్రవాలను తాగకూడదు. ఎందుకంటే దీనివల్ల మీరు రాత్రిళ్లు తరచుగా బాత్ రూం కి వెళ్లాల్సి వస్తుంది. దీంతో మీరు తరచుగా మేల్కోవాల్సి వస్తుంది. ఇది మీ నిద్ర చక్రాలకు డిస్టబెన్స్ కలిగిస్తుంది. ఒకసారి నిద్రలేచిన తర్వాత మళ్లీ నిద్రపట్టడం చాలా కష్టం. 
 


3-2-1 నియమం ప్రయోజనాలు, నష్టాలు

3-2-1 నియమం మీకు రాత్రిపూట బాగా నిద్రపట్టడానికి, రాత్రిపూట తరచుగా మేల్కొనే అవకాశాలను తగ్గించడానికి, జీర్ణిక్రియను మెరుగ్గా ఉంచడానికి, మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

ఇది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంచడానికి, మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీకు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అయితే ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మాత్రం  3-2-1 టైమ్ లైన్ ను అనుసరించడం చాలా కష్టం. 

Latest Videos

click me!