నానపెట్టిన ఎండుద్రాక్ష మహిళలు ఎందుకు తినాలి..?

Published : Nov 09, 2024, 08:34 AM IST

ఎండు ద్రాక్షను కనుక రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగినా, నానిన ఆ కిస్మస్ లను తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయట.

PREV
15
నానపెట్టిన ఎండుద్రాక్ష మహిళలు ఎందుకు తినాలి..?
Dry Raisins

 

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే రెగ్యులర్ గా  డైట్ లో వాటిని భాగం చేసుకోవాలి అని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అయితే… మీకు తెలుసు తెలీదో.. డ్రై ఫ్రూట్స్ ని నార్మల్ గా కాకుండా.. నానపెట్టి తీసుకోవాలి. వాటిలో బాదం పప్పు, అంజీరా ఎలానో.. ఎండు ద్రాక్ష  ముందు వరసలో ఉంటాయి.

 

ఎండు ద్రాక్షను కనుక రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగినా, నానిన ఆ కిస్మస్ లను తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా మహిళలకు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి, అవేంటో ఓసారి తెలుసుకుందాం..

 

25

 

ఐదు నుంచి పది వరకు ఎండు ద్రాక్ష తీసుకొని వాటిని రాత్రిపూట నానపెట్టి.. ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల… గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయట. అందుకే కాదు గుండె పనితీరు కూడా మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్ లాంటివి రాకుండా ఉంటాయి.

 

35

 

ఈ రోజుల్లో సరైన సమయానికి ఆహారం తినకపోవడం లేదంటే.. జంక్ ఫుడ్ లాంటివి తినడం వల్ల చాలా మందిని మలబద్దకం సమస్య వేధిస్తోంది. అలాంటివారు ఈ నానపెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల ఆ  సమస్య నుంచి బయటపడొచ్చట. 20 ఎండు ద్రాక్షలను తీసుకొని నీటిలో నానపెట్టి లేదంటే వాటిని మరిగించి.. అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగితే.. మలబద్దకం అనే సమస్యే ఉండదు.

 

45

 

ప్రతిరోజూ సాయంత్రం వేళ.. స్నాక్స్ లాగా తీసుకున్నా లేదంటే.. నీటిలో నానపెట్టి ఉదయం పూట తీసుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల.. రక్త హీనత అనే సమస్య ఉండదు. ఎవరైతే తమకు రక్తం తక్కువగా ఉందని ఫీల్ అయితే… వాళ్లు వీటిని రోజూ తింటే చాలు. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

 

55

 

ఎండు ద్రాక్షను రెగ్యులర్ గా నానపెట్టి తినడం వల్ల… కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండవట. యూరిన్ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయట. ఆయుర్వేదం ప్రకారం యూరిన్ సంబంధిత సమస్యలకు మంచి ఔషధంలా పని చేస్తుందట.

 

అంతేకాదు… రెగ్యులర్ గా  ఈ ఎండు ద్రాక్షను నానపెట్టి తినడం వల్ల నీరసం  అనేది ఉండదు. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. 

 

click me!

Recommended Stories