మీగడతో మెరిసిపోయే చర్మకాంతి మీ సొంతం.. ట్రై చేయండి..

First Published | Jul 12, 2021, 11:44 AM IST

పాలమీది మీగడ మీ పొడి చర్మానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా మొహానికి రాసుకోవడం వల్ల పొడి చర్మం ఆరోగ్యంగా, అందంగా కాంతివంతంగా తయారవుతుంది. 

మీది పొడి చర్మమా? వేసవి ఎండ చికాకు పెడుతోందా? ఇంట్లోనే ఓ దివ్యౌషధం ఉందన్న సంగతి మీకు తెలుసా? మారుతున్న వాతావరణ పరిస్థితులు పొడి చర్మం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. చర్మంలోని తేమ శాతం తగ్గిపోవడంతో పేలవంగా మారిపోతుంటుంది. దీనికి సరైన విరుగుడు మీ వంటింట్లోనే ఉంది.
undefined
అదే మీగడ.. పాలమీది మీగడ మీ పొడి చర్మానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా మొహానికి రాసుకోవడం వల్ల పొడి చర్మం ఆరోగ్యంగా, అందంగా కాంతివంతంగా తయారవుతుంది
undefined

Latest Videos


అయితే పాల ఉత్పత్తులతో అలెర్జీ ఉంటే.. ముందుగా కొంచెం టెస్ట్ చేసిన తరువాత గానీ వాడకూడదు.
undefined
మీగడ చేసే అద్భుతాలు ఇవే..
undefined
మీగడ నేచురల్ క్లెన్సర్ గా అద్భుతంగా పనిచేస్తుంది : మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. మీగడను మొహం మీదే కాదు.. కాంతిహీనంగా మారిన శరీరంలోని ఏ భాగంలోనైనా వాడొచ్చు. మోకాలు, మోచేతుల మీద నల్లగా మారినచోట పాలమీగడలో నిమ్మరసం కలిసి రాసి, కాసేపయ్యాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
undefined
స్కిన్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది : మీగడను దశాబ్దాలుగా చర్మ సంరక్షణలో ఇంటి చిట్కాగా వాడుతున్నారు. చర్మం మీద ఇరిటేషన్ కలుగుతుంటే ఇది మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెతో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ క్రీమ్ కలపి, మొహానికి ప్యాక్ వేసుకోండి. 20 నిమిషాలు అలాగే ఉంచండి. అది పూర్తయ్యాక, నీటితో శుభ్రం చేసుకోండి.
undefined
మడమల పగుళ్లకు కూడా మీగడ అద్భుతంగా పనిచేస్తుంది. పగుళ్లున్న చోట క్రమం తప్పకుండా రాస్తే సున్నితమైన, మృదువైన మడమలు తయారవుతాయి.
undefined
మీ మొహం కాంతివంతంగా మెరిసిపోవాలంటే మీగడకు మించిన ఔషధం మరోటి లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం ఒక టేబుల్ స్పూన్ మీగడలో ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి కలిపి.. ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించి.. ఆరిన తరువాత కడిగేస్తే.. సహజకాంతి మీ సొంతం అవుతుంది.
undefined
టాన్ రిమూవల్ ఏజెంట్‌ : ఎండవల్ల ఏర్పడే టాన్ ను తొలగించడంలో మీగడ చాలా బాగా పనిచేస్తుంది. సన్ బర్న్, సన్ టాన్ లకు కూలింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.
undefined
దీనికోసం ఒక చెంచా నిమ్మరసంతో మీగడను కలిసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
undefined
మీగడలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టిమంచి మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. మీగడలోని సుగుణాలు.. మీచర్మానికి తేమను, పోషకాలను అందిస్తుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేయడమే కాదు, దెబ్బతిన్న చర్మ కణజాలాలను కూడా బాగు చేస్తుంది.
undefined
click me!