ఓట్స్ vs కార్న్‌ఫ్లేక్స్.. బ్రేక్ ఫాస్ట్ కి ఏది మంచిది?

First Published | Jul 10, 2021, 4:12 PM IST

ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్...ఇవి రెండూ ఆరోగ్యానికి మంచివే. మీరు గనుక మీ రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా వీటిని చేరుస్తున్నట్లైతే.. ఈ రెంటిలో ఏది ఎక్కువ మంచిదో తెలుసుకోవాలి. 

ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువగా తమ రోజును వోట్స్ లేదా కార్న్‌ఫ్లేక్‌ బ్రేక్ ఫాస్ట్ తో మొదలుపెట్టడానికి ఇష్టపడతారు. కార్న్ ఫ్లేక్స్ కాస్త కరకరలాడుతూ నోటికి వింత అనుభూతినిస్తే.. ఓట్స్ కొంచెం చూయీగా ఉంటాయి.
ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్...ఇవి రెండూ ఆరోగ్యానికి మంచివే. మీరు గనుక మీ రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా వీటిని చేరుస్తున్నట్లైతే.. ఈ రెంటిలో ఏది ఎక్కువ మంచిదో తెలుసుకోవాలి.

ఓట్స్ : ఫైబర్‌, పోషకాలు సమృద్ధిగా ఉండే ఓట్స్ చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. ఓట్స్ లో మూడు రకాలుంటాయి. స్టీల్ కట్, ఇన్‌స్టంట్, రోల్డ్ వోట్స్. స్టీల్-కట్ వోట్స్ తక్కువ ప్రాసెస్ చేయబడినవి, ఇన్‌స్టంట్ వోట్స్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి.
ఓట్స్ ముఖ్యంగా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు.. కాబట్టి వాటిని తింటే పొట్ట నిండుగా ఉన్న భావన ఉంటుంది. ఎక్కువ సేపు ఆకలివేయకుండా ఉంటుంది. ఓట్స్ లో ఇనుము, థియామిన్, జింక్, మెగ్నీషియం, సెలీనియంలు ఉంటాయి. ఓట్స్ గ్లూటెన్ ఫ్రీ పీచు పదార్థం కాబట్టి.. గ్లూటెన్ అంటే పడనివారికి ఇది మంచి ఆహారం.
కార్న్‌ఫ్లేక్స్ : మొక్కజొన్నతో తయారయ్యే కార్న్‌ఫ్లేక్స్ కరకరలాడుతూ ఉంటాయి. అందుకే వీటిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడతారు. కార్న్‌ఫ్లేక్స్ గొప్పదనం ఏమిటంటే వీటిని ఉడికించనవసరం లేదు.
వేడి పాలు, చక్కెర వేస్తే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతాయి. కార్న్‌ఫ్లేక్స్ విటమిన్లు, ఫోలేట్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్లకు అద్భుతమైన మూలం. వీటిలో కేలరీలలో చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి అనువైన ఎంపిక ఇది.
మరి ఈ రెండింటిలో ఏది మంచిది? అంటే...వోట్స్, కార్న్‌ఫ్లేక్స్ రెండూ బ్రేక్ ఫాస్ట్ కు బ్రహ్మాండమైన ఎంపికలే.. కానీ రెండింటిలో పోలిస్తే ఓట్స్ మంచి ఎంపిక. 100 గ్రాముల ఓట్స్‌లో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కార్న్‌ఫ్లేక్స్‌లో 7 గ్రాములు ఉంటాయి.
ఫైబర్ పరంగా కూడా ఓట్స్ మంచివి, ఎందుకంటే వాటిలో 16 గ్రాముల ఫైబర్ ఉంటుంది, కార్న్‌ఫ్లేక్స్‌లో 2 గ్రాములు మాత్రమే ఉంటాయి. వోట్స్ ఎందులోనైనా వెనకబడి ఉందంటే అది కేలరీలు. ఒక కప్పు ఓట్స్‌లో 300 కేలరీలు ఉండగా, కార్న్‌ఫ్లేక్స్‌లో 100 మాత్రమే ఉంటాయి.
వోట్స్ ను రుచిగా, మరింత ఆరోగ్యంవంతంగా చేయడానికి, వీటికి తరిగిన పండ్ల ముక్కలు చేర్చవచ్చు. ఓట్స్ లో తీపికోసం చక్కెర కాకుండా బెల్లం, తేనె లేదా స్టెవియా కలపడం ద్వారా వోట్స్ మరింత ఆరోగ్యంగా తయారవుతాయి.
ಅవోట్ మీల్, మసాలా వోట్స్, వోట్స్ చీలా, వోట్స్ స్మూతీ, ఓట్స్ కట్లెట్స్, వోట్స్ చపాతీ ఇలా ఓట్స్‌తో అనేక రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు.
ఇక కార్న్‌ఫ్లేక్స్ విషయానికి వస్తే.. పాలల్లో కార్న్ ఫ్లేక్స్ తో పాటు బాదం, వాల్‌నట్, చియా విత్తనాలు లేదా గుమ్మడికాయ గింజలు వంటివి కలుపుకోవచ్చు. చిన్నగా కోసిన ఆపిల్ ముక్కలు, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు కూడా కార్న్‌ఫ్లేక్స్‌కి అద్భుతమైన రుచిని ఇస్తాయి.
ఇక కార్న్‌ఫ్లేక్స్ విషయానికి వస్తే.. పాలల్లో కార్న్ ఫ్లేక్స్ తో పాటు బాదం, వాల్‌నట్, చియా విత్తనాలు లేదా గుమ్మడికాయ గింజలు వంటివి కలుపుకోవచ్చు. చిన్నగా కోసిన ఆపిల్ ముక్కలు, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు కూడా కార్న్‌ఫ్లేక్స్‌కి అద్భుతమైన రుచిని ఇస్తాయి.

Latest Videos

click me!