చలికాలంలో డ్రై స్కిన్ కు గుడ్ బై చెప్పాలంటే.. ఇవి తప్పకుండా తినండి..

First Published Dec 30, 2022, 4:55 PM IST

చలికాలంలో చర్మంలోని తేమంతా పోతుంది. ఇంకేముంది దీంతో చర్మం బాగా పొడిబారుతుంది. అయితే ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలను తింటే పొడి చర్మం అనే సమస్యే ఉండదు..
 

skin care

ఇతర కాలాలతో పోలిస్తే.. చలికాలంలోనే డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత, తేమలో మార్పుల వల్ల చర్మం ఇలా పొడిబారుతుంది. ఈ డ్రై నెస్ వల్ల చర్మంపై చికాకు, దురద, మంట, దద్దుర్లు వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. 

మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిలో ఆహారం ఒకటి. అవును  ఆహారం మన ఆరోగ్యాన్ని కాపడాటమే కాదు చర్మాన్ని కూడా అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు చర్మంలో తేమను అలాగే ఉంచడానికి సహాయపడతాయి. చలికాలంలో పొడి చర్మంతో బాధపడేవారు ఎలాంటి ఆహారాలను తింటే ఈ సమస్య తగ్గిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

దోసకాయలు

కీరదోసకాయల్లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల.. వీటిలోని పుష్కలంగా ఉన్న నీటి కంటెంట్ మీరు హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ చర్మం మరింత తేమగా ఉండటానికి కూడా తోడ్పడుతుంది. చర్మంలో తేమను, మృదుత్వాన్ని ప్రోత్సహించడానికి సహాయపడే విటమిన్ సిలికా దోసకాయలలో పుష్కలంగా ఉంటుంది. 
 

చిలగడదుంపలు

చలికాలపు ఆరోగ్యకరమైన ఆహారాల లీస్ట్ లో చిలగడదుంపలు కూడా ఉంటాయి. చిలగడదుంపల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ మన చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో రెటినోయిడ్స్, కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ పొడి చర్మానికి గుడ్ బై చెప్పడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. 
 

బచ్చలికూర

బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది చర్మాన్నిఅందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బచ్చలికూర ఫోలేట్ కు మంచి వనరు. బచ్చలికూరలోని ఫోలేట్, ఫైటోన్యూట్రియెంట్స్, దీనిలోని వాటర్ కంటెంట్ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయని తేలింది. అందుకే పొడి చర్మం ఉన్నవాళ్లు బచ్చలికూరను తప్పకుండా తినండి. 

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ ఇ కి గొప్ప వనరు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇవి చర్మాన్ని యువి కిరణాలు, ఫ్రీ రాడికల్ నుంచి రక్షిస్తాయి. కొన్ని విత్తనాలలో సెలీనియం కూడా ఉంటుంది. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడతాయి. అలాగే చర్మం అందంగా ఉంచేందుకు అవసరమైన ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి.
 

గుడ్లు

గుడ్లు చర్మానికి మంచి మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ బి 5, విటమిన్ ఎ, విటమిన్ ఇ  తో సహా ఎన్నో రకాల పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి, మంటను తగ్గించడానికి విటమిన్ డి, సల్ఫర్ లు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని అందంగా మెరిపించడానికి, తేమగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

వాల్ నట్స్

వాల్ నట్స్ లో మొక్కల ఆధారిత ఒమేగా -3 కొవ్వు ఆమ్లం,  ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటాయి. తేమను నిలుపుకోవడానికి, చర్మ కణాలను రక్షించడానికి, చర్మ పొరలను మెరుగుపర్చడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఇతర గింజల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని వృద్ధాప్యం,  ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి.

click me!