Skin Care Tips: ముఖంపై ముడతలు పోయి.. అందంగా మారాలా? అయితే ఈ పండ్లను తినండి..

First Published Jul 1, 2022, 4:13 PM IST

Skin Care Tips: కొన్ని రకాల పండ్లు కూడా ముఖంపై ఉండే ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు ఈ పండ్లు అందాన్ని రెట్టింపు చేస్తాయి. 
 

వయసు పెరుగున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం చాలా కామన్. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ముడతల బారిన పడుతున్నారు. దీనికి కారణం వాతావరణ కాలుష్యం, దుమ్ము, ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం, మద్యం ఎక్కువగా సేవించడం, బాడీ డీహైడ్రేషన్ బారిన పడటం వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై ముడతలు వస్తుంటాయి. 

ఇక ఈ ముడతలను వదిలించుకోవడానికి మార్కెట్ లో ఉండే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా వాడుతుంటారు. కానీ వీటిలో ఉండె కెమికల్స్ మీ చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఈ ముడతలను సహాజ పద్దతుల్లో పోగొట్టడానికి ప్రయత్నించండి. 

అయితే కొన్ని రకాల పండ్లు కూడా ముడతలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు ముడతలను తగ్గించడంతో పాటుగా చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి కూడా. ఇందుకోసం ఎలాంటి పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

బొప్పాయి (Papaya)

బొప్పాయి మన  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది యాంటీ ఏజింగ్ పండు కూడా. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. పపైన్ అనే ఎంజైమ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మ వాపును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అంతేకాదు ముఖంపై ఉండే ముడతలను కూడా తగ్గిస్తాయి. బొప్పాయిలో ఉండే ఇతర పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. అందుకే ముడతల సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయిని రెగ్యులర్ గా తినండి.
 

బెర్రీలు (Berries)

బెర్రీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మీ చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. ఇక వీటిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ పోషకాలు కంటి ఆరోగ్యానికి కూడా మేలే చేస్తాయి. 

దానిమ్మ (Pomegranate)

వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే చర్మ ముడతలను, తెల్ల వెంట్రుకల సమస్యలను తగ్గించంలో ఈ పండు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పండులో Funerals అనే సమ్మేళనాలు ముడతలను, కొల్లాజెన్ ఫైన్ లైన్లతో పోరాడుతాయి. అంతేకాదు ఈ పండు మీ చర్మాన్ని కాంతివంతంగా, అందంగా తయారుచేస్తుంది. 

click me!