పురుషులు ఎందుకు ఎక్కువగా బ్రేకప్ లు చెబుతారు..?

First Published | Nov 21, 2022, 2:28 PM IST

తమను పొందే అర్హత వారికి లేదు అనే భావన కలిగినప్పుడు కూడా పురుషులు ఎక్కువగా బ్రేకప్ చెబుతూ ఉంటారట.

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఎప్పుడో ఒకప్పుడు పలకరిస్తుంది.అయితే... ఆ ప్రేమను కొందరు కడవరకు కాపాడుకుంటారు. మరి కొందరు మధ్యలోనే బ్రేకప్ తో ముగుస్తారు. ముఖ్యంగా బ్రేకప్ లు ఎక్కువగా పురుషులే చెబుతుంటారట. అసలు... పురుషులు బ్రేకప్ లు చెప్పడానికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం...

స్త్రీలే కాదు... పురుషులు కూడా ఎక్కువగా పొగడ్తలు కోరుకుంటారట. అయితే....తాము కోరుకున్న పొగడ్తలు, ప్రశంసలు, అభినందనలు లభించని సమయంలో వారు అసహనానికి గురౌతూ ఉంటారు. అలాంటి సమయంలోనే... వారు ఎక్కువగా బ్రేకప్ చెప్పాలని అనుకుంటూ ఉంటారట.


ఈ రిలేషన్ లో ఈ వ్యక్తితో ఉండటం వల్ల ఉపయోగం లేదు... తమను పొందే అర్హత వారికి లేదు అనే భావన కలిగినప్పుడు కూడా పురుషులు ఎక్కువగా బ్రేకప్ చెబుతూ ఉంటారట.


దంపతుల మధ్య కంపటాబులిటీ విషయంలో తేడాలు వచ్చినప్పుడు కూడా.... పురుషులు ఎక్కువగా బ్రేకప్ లు చెబుతూ ఉంటారు. వారికి ఎక్కువగా కంపాటబులిటీ ఉన్నవారితోనే ఉండాలని వారు అనుకుంటారట. అలా లేకపోతే... బ్రేకప్ చెప్పడానికి వారు వెనకాడరు.
 

దంపతుల మధ్య రిలేషన్ సరిగా ఉండాలి అంటే... వారి మధ్య సెక్స్ లైఫ్ కూడా సరిగా ఉండాలి. అలా లేకపోతే.... రొమాన్స్, సెక్స్ లైఫ్ సరిగాలేనప్పుడు కూడా... వారు బ్రేకప్  చెప్పాలి అనుకుంటారు.
 

ఏ బంధం నిలవాలన్నా... వారి మధ్య నమ్మకం ఉండాలి. అలా కాకుండా.. ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని.. తమను మోసం చేసే పార్ట్ నర్ తో ఉండాలని ఎవరూ అనుకోరు. తమను మోసం చేసే వ్యక్తికి కూడా పురుషులు ఎక్కువగా బ్రేకప్ చెబుతారు.
 

పురుషులు ఎక్కువగా... తమ పార్ట్ నర్ నుంచి గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం తమకు తమ భాగస్వామి నుంచి లభించడం లేదు అంటే... వారు తమ పార్ట్ నర్ కి బ్రేక్ చెప్పేస్తారు.

ప్రతి విషయంలో తమకు పరిమితులు విధించే పార్ట్ నర్ ని ఎవరూ కోరుకోరు. అలా తమను ప్రతి విషయంలో కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం.... పురుషులు ఎక్కువగా బ్రేకప్ చెప్పేస్తారట.
 

Latest Videos

click me!