ఈ తీపి పదార్థాన్ని తింటే బరువు ఏ మాత్రం పెరగరు.. సులువుగా తగ్గుతారు తెలుసా..?

First Published Nov 21, 2022, 12:55 PM IST

 సాధారణంగా తీపి పదార్థాలను తింటే బరువు పెరుగుతారన్న ముచ్చట చాలా మందికి ఎరుకే.. కానీ ఓ తీపి పదార్థం మాత్రం బరువును పెంచడానికి బదులుగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేంటంటే.. 
 

నిజానికి చక్కెరతో చేసిన స్వీట్లు, పానీయాలు, ఇతర తీపి పదార్థాలు శరీర బరువును అమాంతం పెంచుతాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మన శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువైతే.. అది కొవ్వుగా మారుతుంది. ఈ కొవ్వు పొట్ట, నడుము చూట్టూ ఎక్కువగా పేరుకుపోతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే చాలా మంది తీపిపదార్థాలను ముట్టనే ముట్టరు. 
 

నిజం చెప్పాలంటే మన శరీరానికి కొంత మొత్తంలో చక్కెర అవసరమవుతుంది. మనన శరీరంలో చక్కెర మొత్తలే లేకుంటే మగతగా, శక్తిహీనంగా అనిపిస్తుంది. చక్కెరతోనే మన శరీరం శక్తవంతంగా మారుతుంది. అయితే శుద్ధి చేసిన చక్కెర మన శరీరానికి మేలు కంటే  హానే ఎక్కువ చేస్తుంది. అందుకే తెల్ల చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన చక్కెరను తీసుకోవాలి. అప్పుడే మనం బరువును చాలా వరకు తగ్గుతాం.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

బరువు తగ్గడానికి తేనె

శుద్ధి చేసిన చక్కెర కంటే తేనె నే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీ డైట్ దీన్ని పక్కాగా తీసుకోవాలి. ఇది  ఊబకాయాన్ని తగ్గించడమే కాదు.. చర్మాన్ని అందంగా మార్చడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

తేనెలో విటమిన్ సి, విటమిన్ బి6, అమైనో ఆమ్లాలు, రిబోఫ్లేవిన్, కార్భోహైడ్రేట్లు, నియాసిన్ లు పుష్కలంగా ఉంటాయి. తేనెలో కేలరీలు, చక్కెరలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతామన్న భయం ఉండదు. నిజానికి ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

తేనె ఎలా బరువు తగ్గిస్తుంది

నేషనల్ సెటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. ఇది కేలరీలను త్వరగా కరిగిస్తుంది. దీంతో మీరు చాలా తొందరగా బరువు తగ్గడం ప్రారంభమవుతారు. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. దీంతో కొవ్వులు బాగా కరిగిపోతాయి. 
 

తేనెను ఎలా తీసుకోవాలి? 

వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో టీ స్పూన్ తేనెను బాగా కలిపి తాగండి. ఇంకా మెరుగైన ఫలితాలను పొందాలనుకుంటే దీనికి నిమ్మరసాన్ని కూడా జోడించండి. అయితే కొంతమంది గ్రీన్ టీలో తేనెను కలిపి తాగడానికి ఇష్టపడతారు. 
 

click me!