dark circles
అందంగా కనిపించాలని కోరుకోని అస్సలు వారుండరు. ఒకప్పుడు అందంగా కనిపించాలని అమ్మాయిలు మాత్రమే అనుకునేవారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా అందంగా కనిపించాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా వాడుతున్నారు. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సరే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలనే ఎన్నో పనులను చేస్తున్నారు. అయితే మారుతున్న జీవనశైలి, కాలుష్యం కారణంగా మన చర్మం ఎన్నో సమస్యల బారిన పడుతోంది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న చర్మ సమస్య డార్క్ సర్కిల్స్.
డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి ఖరీదైన వాటిని ఉపయోగించే వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాని వారు కూడా ఉన్నారు. నిజానికి కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం వల్ల కూడా ఈ చర్మ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తినాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం
విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం పప్పులు మన ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో చర్మాన్ని పోషించే లక్షణాలు ఉంటాయి. బాదం చర్మాన్ని తేమగా మార్చడానికి, డ్రైనెస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిని తింటే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
బ్లూ బెర్రీలు
బ్లూబెర్రీస్ లో విటమిన్ సితో పాటుగా యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను బలోపేతం చేస్తాయి. అలాగే డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేయడానికి కూడా సహాయపడతాయి.
సాల్మన్ ఫిష్
సాల్మన్ ఫిష్ లో ఎక్కువ మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి మన కళ్ల చుట్టూ ఉన్న నలుపును తగ్గించడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది కూడా.
బచ్చలికూర
బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గాయాలను మాన్పుతుంది. అలాగే చర్మ రంగును మెరుగుపరుస్తుంది.
పసుపు
పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనం. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. పసుపుతో ఫేస్ మాస్క్ ను తయారు చేసుకుని కూడా వాడొచ్చు. ఇది మీ ముఖాన్ని అందంగా మారుస్తుంది.
അവോക്കാഡോ
అవొకాడో
అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలాగే చర్మం పొడి బారడాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ కె డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది.