Fridge Buying Tips: సింగిల్ డోర్ vs డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. ఎవరికి ఏది బెస్ట్?

Published : Apr 23, 2026, 02:45 PM IST

కొత్త ఫ్రిడ్జ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బడ్జెట్ మాత్రమే చూడకండి. సింగిల్ డోర్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌ల మధ్య అసలు తేడాలు ఏంటి? రెండింట్లో ఏది బెస్ట్? ఎవరు ఏది తీసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
14
సింగిల్ డోర్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఏది బెస్ట్

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా వేసవిలో చల్లటి నీళ్లు, కూరగాయలు, ఆహారం తాజాగా ఉంచడానికి ఇది కావాల్సిందే. అయితే, కొత్త ఫ్రిడ్జ్ కొనేటప్పుడు సింగిల్ డోర్, డబుల్ డోర్ మధ్య తేడా ఏంటి? రెండింట్లో ఏది ఎంచుకోవాలో చాలామందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ వివరాలు. ఓసారి చూసేయండి. 

24
సింగిల్ డోర్ ఫ్రిడ్జ్

చాలా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లనే ఇష్టపడతాయి. ఇవి 'డైరెక్ట్ కూల్' టెక్నాలజీతో పనిచేస్తాయి. కాబట్టి కరెంట్ వాడకం చాలా తక్కువ. వీటి ధర రూ.10,000 నుంచి రూ.18,000 మధ్యలో ఉంటుంది. బడ్జెట్ గురించి ఆలోచించే వారికి ఇది మంచి ఆప్షన్. ఇద్దరు లేదా ముగ్గురు ఉండే చిన్న కుటుంబానికి ఇది సరిపోతుంది. కానీ, ఇందులో ప్లేస్ తక్కువగా ఉంటుంది. ఫ్రీజర్‌లో పేరుకుపోయిన ఐస్ ని మనమే 'డీఫ్రాస్ట్' చేయాల్సి ఉంటుంది.

34
డబుల్ డోర్ ఫ్రిడ్జ్

డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు 'ఫ్రాస్ట్-ఫ్రీ' టెక్నాలజీతో వస్తాయి. అంటే, ఇందులో ఐస్ గడ్డకట్టే సమస్య ఉండదు. 4 నుంచి 6 మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబాలకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. పెద్ద గిన్నెలు, ఎక్కువ కూరగాయలు పెట్టడానికి ఇందులో విశాలమైన స్థలం ఉంటుంది. ఫ్రీజర్, ఫ్రిడ్జ్‌కు వేర్వేరు డోర్లు ఉండటం వల్ల కూలింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కానీ సింగిల్ డోర్‌తో పోలిస్తే వీటి ధర, కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువ.

44
ఏది ఎంచుకోవాలి?

మీరు ఏ ఫ్రిడ్జ్ కొన్నా 3-స్టార్ లేదా 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం తెలివైన పని. ప్రస్తుతం మార్కెట్లో 'డిజిటల్ ఇన్వర్టర్' టెక్నాలజీతో ఫ్రిడ్జ్‌లు దొరుకుతున్నాయి. ఇవి శబ్దం తక్కువ చేస్తాయి, కరెంట్ ఆదా చేస్తాయి. 'కన్వర్టిబుల్ మోడ్' సౌకర్యం ఉంటే, అవసరమైనప్పుడు ఫ్రీజర్‌ను కూడా సాధారణ ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు.

మీ బడ్జెట్, కుటుంబ సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఫ్రిడ్జ్‌ను ఎంచుకోవాలి. సరైన మోడల్‌ను ఎంచుకుంటే ఆహారం తాజాగా ఉండటమే కాకుండా, మీ కరెంట్ బిల్లు కూడా అదుపులో ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories