Curd: పెరుగును ఇలా స్టోర్ చేస్తే అస్సలు పాడవ్వదు

Published : Apr 23, 2026, 02:03 PM IST

Curd: వేసవి కాలంలో తినే భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. రోజూ బయటకొనడం కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్. ఒక్కోసారి ఇంట్లో చేసిన పెరుగు కొన్ని గంటల్లోనే పుల్లగా అయిపోతుంది. పెరుగు త్వరగా పులియకుండా, తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి.

PREV
17
పెరుగు త్వరగా పులియకుండా, తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి.

వేసవి కాలంలో తినే భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. రోజూ బయటకొనడం కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్. ఒక్కోసారి ఇంట్లో చేసిన పెరుగు కొన్ని గంటల్లోనే పుల్లగా అయిపోతుంది. పెరుగు త్వరగా పులియకుండా, తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి.

27
మట్టి పాత్రలు

పెరుగును నిల్వ చేయడానికి మట్టి పాత్రలు (Clay Pots) చాలా బెటర్. మట్టిపాత్రలో ఉండే రంధ్రాలు పెరుగులోని అదనపు తేమను పీల్చుకుంటాయి. దీనివల్ల పెరుగు గడ్డలాగా, రుచిగా ఉండటమే కాకుండా త్వరగా పులియదు.

37
గాలి తగలకుండా చూసుకోవాలి

పెరుగును నిల్వ చేసే గిన్నెపై మూత సరిగ్గా ఉండాలి. ఎయిర్ టైట్ కంటైనర్ (Airtight Container) వాడటం వల్ల గాలిలోని బ్యాక్టీరియా పెరుగుతో చేరకుండా ఉంటుంది. దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

47
గాజు/పింగాణీ పాత్రలు మంచిది

మీరు మట్టి పాత్రలు వాడలేకపోతే, గాజు లేదా పింగాణీ పాత్రలను ఎంచుకోండి. స్టీలు పాత్రలలో నిల్వ చేస్తే వాతావరణ మార్పుల వల్ల పెరుగు త్వరగా పులిసిపోయే అవకాశం ఉంది.

57
ఫ్రిజ్‌లో ఎక్కడ పెట్టాలి?

చాలామంది పెరుగును ఫ్రిజ్ డోర్ వైపు పెడుతుంటారు. కానీ, డోర్ మాటిమాటికీ తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. కాబట్టి, పెరుగును ఫ్రిజ్ లోపల చివరి వైపు ఉంచితే ఎక్కువ కూలింగ్ తగిలి పాడవకుండా ఉంటుంది.

67
ఎండు మిరపకాయ చిట్కా

ఇది ఒక అద్భుతమైన చిట్కా. తోడు పెట్టిన పెరుగు గడ్డ కట్టిన తర్వాత, అందులో ఒక ఎండు మిరపకాయను వేసి ఉంచండి. మిరపకాయలోని లక్షణాలు పెరుగును ఎక్కువ సేపు పులియకుండా ఉంచుతాయి.

77
తడి స్పూన్లు వాడకండి

పెరుగును తీసేటప్పుడు ఎప్పుడూ పొడి స్పూన్‌ను మాత్రమే వాడాలి. తడి స్పూన్ వాడటం వల్ల లేదా సగం తిన్న స్పూన్ మళ్లీ పెరుగులో పెట్టడం వల్ల అందులో బ్యాక్టీరియా పెరిగి పెరుగు త్వరగా పాడవుతుంది.

పెరుగు తోడు పెట్టేటప్పుడు పాలు మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చని పాలలో తోడు వేస్తేనే పెరుగు నాణ్యత బాగుంటుంది. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లోని పెరుగు కనీసం 3 నుండి 4 రోజుల వరకు తాజాగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories