పిల్లల్లో మార్పు తెచ్చే ప్రశ్నలు...
1.ఏం జరిగింది..?
మీ పిల్లలు ఏదైనా తప్పు చేశారు అని మీకు అనిపిస్తే.. వెంటనే వారిని కూర్చోపెట్టుకొని అసలు ఏం జరిగింది అనే విషయం అడగాలి. వాళ్లు చెబుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడకూడదు. పూర్తిగా వారు చెప్పేది వినాలి. అప్పుడు పిల్లలు నిజం చెప్పడానికి ముందుకు వస్తారు.
2.జరిగిన తప్పును ఎలా సరిదిద్దుదాం..?
తప్పు జరిగిపోయింది. కాబట్టి.. తర్వాత ఏం చేయాలి అనే విషయం చాలా కీలకం. కాబట్టి.. చేసిన తప్పును ఎలా సరిదిద్దాలి అనే విషయం గురించి పిల్లలు ఆలోచించేలా చేయాలి. సారీ చెప్పడం, కింద పడిన దానిని తీయడం.. ఇలా ఏదో ఒక పరిష్కారం వారి నుంచే చెప్పించాలి.
3.మరోసారి తప్పు జరగకూడదంటే ఏం చేయాలి?
ఈ ప్రశ్న అడగడం వల్ల.. మీ పిల్లలు మరోసారి తప్పు చేయడానికి ఆలోచిస్తారు. ఇది వారి తప్పుల నుండి నేర్చుకోవడానికి సహాయపడుతుంది.
ఇది పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
మీ పిల్లలు పరిష్కారాలను స్వయంగా ఆలోచించినప్పుడు, వారిలో జవాబుదారీతనం లేదా బాధ్యత పెరుగుతాయి.