Fridge Guide: సింగిల్ డోర్ లేదా డబుల్ డోర్.. ఏ ఫ్రిడ్జ్ కొంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది?

Published : Jul 22, 2026, 10:17 AM IST

Fridge Guide:  మీరు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అయితే ఎలాంటి ఫ్రిజ్ కొనాలా అని ఆలోచిస్తున్నారా? సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ మంచిదా, డబుల్ డోర్ కొనాలా? అని గందరగోళంగా ఉందా? అయితే మీ కోసమే ఈ కథనం.

PREV
13
సింగిల్ డోర్, డబుల్ డోర్ మధ్య తేడా

సింగిల్ డోర్ ఫ్రిజ్ కు  ఒకే ఒక్క డోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లోపలే పైభాగంలో ఫ్రీజర్ కోసం చిన్న అర ఉంటుంది. ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో రెండు డోర్లు ఉంటాయి.  సింగిల్ డోర్ ఫ్రిజ్ డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫ్రీజర్‌లో తరచుగా ఐస్ ఎక్కువగా పేరుకుపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు 'డీఫ్రాస్ట్' చేసి ఐస్‌ను తీసేస్తూ ఉండాలి. అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మాత్రం ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీతో వస్తాయి. ఫ్రిడ్జ్ అంతటా ఆటో ఎయిర్ సర్క్యులేషన్ ద్వారా కూలింగ్ సమానంగా ఉంటుంది. కాబట్టి ఫ్రీజర్‌లో అనవసరంగా ఐస్ పేరుకోదు.

కరెంట్ వాడకం

సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడేవారికి కరెంట్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది. కానీ డబుల్ డోర్ ఫ్రిజ్ కెపాసిటీ ఎక్కువగా (200 లీటర్ల కంటే ఎక్కువ) ఉంటుంది. సింగిల్ డోర్‌తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. అయితే, ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు కరెంట్ వాడకం కంట్రోల్‌లో ఉంటోంది.

23
ఎవరు ఏది కొనాలి?

మీ కుటుంబం సైజును బట్టి ఫ్రిజ్ ఎంపిక చేసుకోవాలి. వీరు సింగిల్ డోర్ ఫ్రిజ్ కొనుక్కుంటే మంచిది. దీని ధర బడ్జెట్‌లో ఉంటుంది. దీని కరెంట్ వాడకం తక్కువ కాబట్టి నెలవారీ బిల్లు ఆదా అవుతుంది. 1 నుంచి 3 మంది ఉండే చిన్న కుటుంబాలకు అవసరమైనంత స్థలం ఉంటుంది. వంటగదిలో చాలా తక్కువ స్థలాన్ని ఈ ఫ్రిజ్ తీసుకుంటుంది.

ఒక డబుల్ డోర్ ఫ్రిజ్ ఎక్కువ కెపాసిటీతో వస్తుంది. ఇంట్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు కూరగాయలు, =ఆహార పదార్థాలు స్టోర్ చేయడానికి 250 లీటర్ల కంటే ఎక్కువ స్థలం అవసరం. ఫ్రిడ్జ్, ఫ్రీజర్‌కు వేర్వేరు డోర్లు ఉండటం వల్ల, తరచుగా తెరిచినా కూలింగ్ వేస్ట్ కాదు. ఐస్ క్రీమ్, మాంసం వంటివి ఎక్కువగా నిల్వ చేసుకోవచ్చు. ఆటో-డీఫ్రాస్ట్ టెక్నాలజీ ఉండటం వల్ల, ఫ్రీజర్‌లో మనమే ఐస్‌ను తీయాల్సిన అవసరం ఉండదు.

33
కరెంట్ బిల్ ఎలా వస్తుంది?

సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లు డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పనిచేస్తాయి. కాబట్టి చాలా తక్కువ కరెంట్ వాడుతుంది. 3 లేదా 4 స్టార్ రేటింగ్ ఉన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు నెలవారీ కరెంట్ బిల్లును చాలా తక్కువగా పెంచుతాయి.

డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీ, ఆటో-డీఫ్రాస్ట్ హీటర్లను కలిగి ఉంటాయి. కాబట్టి సింగిల్ డోర్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ కరెంట్ తీసుకుంటాయి. .

ఫైనల్‌గా ఏది బెస్ట్?

తక్కువ కరెంట్ బిల్లు రావాలనుకుంటే సింగిల్ డోర్ ఫ్రిజ్ కొనుక్కోండి.  సులభమైన మెయింటెనెన్స్, శ్రమ లేని వాడకం కావాలంటే డబుల్ డోర్ బెస్ట్.

Read more Photos on
click me!

Recommended Stories