వ్యాయామానికి ముందు వీటిని తింటే మంచిది..

Published : Nov 28, 2022, 01:56 PM IST

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు కంట్రోల్ లో ఉంటుంది. అయితే వ్యాయామం చేయడమే కాదు.. వ్యాయామానికి ముందు కొన్ని ఆహారాలను తినడం కూడా ముఖ్యమంటున్నారు పోషకాహార నిపుణులు.   

PREV
16
వ్యాయామానికి ముందు వీటిని తింటే మంచిది..

మన  శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో.. పోషకాహారం కూడా అంతే అవసరం. పోషకాహారం మీరు మరింత మెరుగ్గా వ్యాయామం చేయడానికి సహాయపడుతుంది. కండరాలు దెబ్బతినే అవకాశాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీరు చక్కగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకే వ్యాయామం తర్వాతే కాదు.. వ్యాయామానికి ముందు కూడా సరైన పోషకాహారం తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు లవ్నీత్ బాత్రా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలియజేశారు. వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

బనానా స్మూతీ

బనానా స్మూతీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండ్లలో ఉండే పెక్టిన్ మీ కడుపును ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది ఆకలిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అరటిపండ్లలో ఉండే పొటాషియం నరాలు, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు వ్యాయామం చేయడానికి మీకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. పోషకాహార నిపుణుడు లవ్నీత్ బాత్రా ప్రకారం.. అరటి స్మూతీ వ్యాయామం చేయడానికి ముందు తినడానికి ఉత్తమమైన ఆహారం.
 

36

చిలగడదుంప చాట్

చిలగడదుంప చాట్ కూడా ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. చిలగడదుంపల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కఠినమైన వ్యాయామాలు చేసేటప్పుడు ఈ చిలగడదుంపలు మీకు అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడతాయి.

46

black coffee

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ మన శరీరానికి ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. మీ వ్యాయామానికి ముందు మీరు బ్లాక్ కాఫీ, అరటిపండు తీసుకోవచ్చని లవ్నీత్ బాత్రా చెప్పారు. బ్లాక్ కాఫీ శరీరానికి అవసరమైన బలం, శక్తిని అందించడానికి సహాయపడుతుంది. అరటిపండ్లు త్వరగా జీర్ణమై శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
 

56

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయలకు ఎక్కువగా పోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి.. తరచుగా దాహం అవుతుంటుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి కొబ్బరి నీరు ఉత్తమ మార్గం. దీనిలో ఉండే పొటాషియం కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
 

66
peanut butter

వేరుశెనగ వెన్న

మీరు వ్యాయామం చేయడానికి ముందు ఒక టీస్పూన్ వేరుశెనగ వెన్న, హోల్ గ్రెయిన్ బ్రెడ్ ను తినొచ్చు. ఇది శరీరంలో శక్తిని ఎక్కువ కాలం ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో మంచి కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories