Rolling Pin: రెగ్యులర్ గా మనం చపాతీ పీట, కర్ర వాడుతూ ఉంటాం. సరిగా శుభ్రం చేయకపోతే.. ఈ రెండూ నల్లగా మారిపోతాయి. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మళ్లీ దానిని కొత్త దానిలా మార్చేయచ్చు.
మన దేశంలో అన్నం ఎంత రెగ్యులర్ గా తింటూ ఉంటామో… చపాతీలు కూడా అంతే రెగ్యులర్ గా తింటూ ఉంటాం. అయితే. చపాతీలు చేసుకునే చపాతీ పీట, కర్రను సరిగా శుభ్రం చేయకపోతే.. దానిమీద పిండి పేరుకుపోతుంది.
దీని వల్ల చపాతీ పీట, కర్ర పాతవాటిలా కనిపిస్తాయి. అంతేకాదు, పాత పిండి, తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీ చపాతీ పీట చెక్కతో చేసింది అయినా… రాయితో చేసింది అయినా కూడా రెగ్యులర్ గా శుభ్రం చేయడం ముఖ్యం. అయితే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. దానిని మళ్లీ కొత్త దానిలా మార్చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
25
వేడి నీటిలో నానపెట్టాలి...
మీరు మీ చపాతీ కర్ర, పీటను కొత్త దానిలా మార్చాలంటే.. ముందుగా వేడి నీటిలో పది నుంచి 15 నిమిషాల పాటు నానపెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిపై పేరుకుపోయిన మురికి, పిండి మెత్తబడి.. సులభంగా వచ్చేస్తుంది. కావాలంటే… ఆ నీటిలో మీరు నిమ్మరసం, డిటర్జెంట్, వెనిగర్ కూడా చేర్చొచ్చు. మరింత సమర్థవంతంగా పని చేస్తుంది.
35
నిమ్మరసం తో శుభ్రం చేయాలి...
చపాతీ పీట, కర్రపై ఉన్న నల్లటి మరకలు, మురికిని తొలగించడానికి నిమ్మరసం బాగా పని చేస్తుంది. దీని కోసం, ముందుగా కొద్దిగా నీటిని గోరువెచ్చగా చేసి అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఇప్పుడు అదే నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత స్పాంజ్ లేదా స్క్రబ్బర్ తో ఈ మిశ్రమాన్ని చపాతీ పీట, కర్ర పై రుద్దాలి. తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే సరిపోతుంది. నిమ్మకాయలోని యాసిడ్ నల్లటి మరకలు, జిడ్డు సులభంగా వదులుతుంది. కొద్ది నిమిషాల్లోనే చపాతీ కర్ర, పీట కొత్త వాటిలా మెరిసిపోతాయి.
పీట, కర్రను శుభ్రం చేయడానికి మరో సులభమైన మార్గం వెనిగర్. దీనికోసం, గోరువెచ్చని నీటిలో 2-3 చెంచాల వెనిగర్ కలపండి. ఈ మిశ్రమంలో పీట, కర్రను సుమారు 5 నిమిషాల పాటు నానబెట్టండి. వెనిగర్ పాత మరకలు, జిడ్డు, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత స్పాంజ్, బ్రష్ లేదా స్క్రబర్‌తో బాగా రుద్ది కడగండి. మరకలు మరీ ఎక్కువగా ఉంటే, ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కూడా కలపొచ్చు. ఉప్పు సహజ క్లీనర్‌గా పనిచేసి, మొండి మరకలను త్వరగా తొలగిస్తుంది. ఇది బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
55
ఎండలో ఆరబెట్టడం మర్చిపోవద్దు
శుభ్రం చేసిన తర్వాత, పీట, కర్రను మంచి నీటితో కడిగి, పొడి క్లాత్ తో తుడవాలి. ఆ తర్వాత కాసేపు ఎండలో పెట్టండి. ఇలా చేయడం వల్ల తేమ పూర్తిగా పోయి, పీట, కర్ర ఎక్కువ కాలం శుభ్రంగా, సురక్షితంగా ఉంటాయి.