Kitchen Hack: చిన్న కిచెన్ ను పెద్దగా కనిపించేలా సూపర్ ఐడియా...చూస్తే వావ్ అంటారు

Published : May 19, 2026, 05:25 PM IST

Kitchen Hack: మీ కిచెన్ చిన్నగా ఉందని అస్సలు ఫీల్ అవ్వకండి. చిన్న స్థలాన్ని కూడా అందంగా, సౌకర్యంగా మార్చుకోవడం కష్టమేమీ కాదు. కాస్త బుర్రపెడితే మోడ్రన్‌గా కిచెన్‍గా చేయొచ్చు. ఆలోచన, ప్లానింగ్ ఉంటే చాలు... ఎంత చిన్న వంటగదినైనా ఇట్టే మార్చేయొచ్చు. 

PREV
18
కిచెన్‍లో మ్యాజిక్ ఇదే

వంటగది గోడలకు డార్క్ కలర్స్ వాడటానికి బదులుగా వైట్, క్రీమ్ లేదా పేస్టల్ కలర్స్ ఎంచుకోవడం చాలా మంచిది. ఈ రంగులు కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనివల్ల మీ చిన్న కిచెన్ కూడా చూసేందుకు ఎంతో మోడ్రన్ గా, విశాలంగా కనిపిస్తుంది. 

28
నిలువుగా సర్దండి

అన్ని వస్తువులు కింద పెట్టకుండా గోడలకు అల్మారాలు పెట్టుకోండి. అప్పుడు సామానులన్నీ వాటిలోకి వెళ్లిపోతాయి. అప్పుడు ప్లేస్ సేవ్ అవుతుంది. అప్పుడప్పుడు వాడుకునే వస్తువులను పైన పెట్టుకుంటే….రోజూవాడేవి అందేలా ఉంచుకుంటే సరిపోతుంది. అప్పుడు సామానుల కోసం వెతకాల్సిన పని ఉండదు. టైం సేవ్ అవుతుంది.

38
అద్దాల డోర్లతో అందం

కిచెన్‍లో కబోర్డులకు చెక్క తలుపులు కాకుండా అద్దాల డోర్లు పెట్టండి. అప్పుడు మీ కిచెన్‍కు రాయల్ లుక్ తీసుకొస్తుంది. అంతేకాకుండా కిచెన్‌ ఇరుకుగా అనిపించకుండా చేస్తుంది.

48
మడతపెట్టే టేబుల్స్

చాలా మంది కిచెన్‌లో కూరగాయలు కోయడానికి, తినడానికి చోటు ఉండదు. అందుకని ఓ బాధ పడిపోకుండా కిచెన్ లోనే మడత టేబుల్స్ పెట్టుకోండి. దానివల్ల అవసరమైనప్పుడు కూరగాయులు కట్ చేసుకోవచ్చు. వీలైతే డైనింగ్ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు. అవసరం లేనప్పుడు మడిచిపెట్టొచ్చు.

58
హ్యాంగింగ్ రాక్స్ వాడండి
గరిటెలు, కత్తులు, చిన్న గిన్నెలను అలమారాల్లో పెట్టే బదులు, గోడకు అందమైన హ్యాంగర్లు తగిలించి వేలాడదీయండి. ఇది చూడటానికి బాగుంటుంది, చోటు ఆదా అవుతుంది.
68
మాగ్నెటిక్ స్ట్రిప్స్ ఐడియా

ఇళ్లల్లో కత్తెరలు, కత్తులు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. అవసరానికి దొరకవు. వెతికి వెతికి అలసిపోతాం. మళ్లీ ఎప్పుడో కనిపిస్తుంది. అలాంటప్పుడు మాగ్నెటిక్ స్ట్రిప్స్ అంటించండి. దానికి ఈ ఇనుప వస్తువులు అంటుకుంటాయి. దీనివల్ల కిచెన్ డ్రాయర్లలో స్థలం మిగులుతుంది. వస్తువులు తీసుకోవడం కూడా సులభం. ఎదురుగానే కనిపిస్తుంది. వెతకాల్సిన పని ఉండదు.

78
లైటింగ్‌తో కొత్త కళ

కిచెన్ కౌంటర్‌టాప్ పైన ఉన్న అలమారాల కింద LED స్ట్రిప్ లైట్లు పెట్టండి. ఇవి వంట చేసేటప్పుడు మంచి వెలుతురు ఇవ్వడమే కాక, కిచెన్‌కు అదిరిపోయే లుక్ ఇస్తాయి. అంతేకాకుండా సింక్ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని వృథా చేయకండి. అక్కడ చిన్న రాక్స్ పెట్టి సబ్బులు, స్క్రబ్బర్లు, క్లీనింగ్ లిక్విడ్స్ దాచుకోవచ్చు.

88
మూలలను వాడుకోండి

కిచెన్ మూలల్లోని స్థలం చాలా వరకు వృథా అవుతుంది. అక్కడ 'L' ఆకారపు డ్రాయర్లు లేదా 'లేజీ సుసాన్స్' పెడితే, మూలల్లోని వస్తువులను కూడా సులభంగా తీసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన టిప్ ఇదే - పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలు, పగిలిన సామాన్లను వెంటనే పడేయండి. అప్పుడే ప్లేస్ ఎక్కువ కనిపిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories