Fridge Care Tips: కొన్ని రోజులపాటు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకపోతే స్మెల్ వస్తుంటుంది. దాని కోసం ఏం కంగారు పడొద్దు. కేవలం రూ.10 తో ఈ సమస్యకు చెక్ పట్టొచ్చు. సింపుల్ ట్రిక్స్‌తో మీ ఫ్రిజ్ పనితీరును మెరుగుపర్చొచ్చు.
ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా దుర్వాస వస్తోందా? అయితే ఈ చిట్కా ట్రై చేయండి. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. దానివల్ల దుర్వాసన పోయి ఫ్రిజ్ ఫ్రెష్‍గా ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి గడువు ముగిసిన ఆహార పదార్థాలను తొలగిస్తే వాసన ఉండదు. కాకపోతే ఈ చిన్న జాగ్రత్త పాటించండి..ఫ్రిజ్ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది.
25
వేసవిలో కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే ఇలా ట్రై చేయండి
వేసవిలో ఫ్రిజ్ సమస్యలు ఎక్కువ అవుతాయి. తరచూ తలుపు తెరవడం, వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఆహారాన్ని చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. తలుపును అవసరమైనప్పుడు మాత్రమే తెరవాలి. వెనుక భాగంలో గాలి సరిగా ప్రసరించేలా చూసుకోవాలి. ఫ్రిజ్ సమర్థవంతంగా పనిచేసి కరెంట్ బిల్లు తగ్గించడంలో సహాయపడుతుంది.
35
ఫ్రీజర్‌లో పేరుకుపోయిన మంచును తొలగించడం ఎలా?
పాత ఫ్రిజ్‌లలో ఫ్రీజర్‌లో మంచు గడ్డకట్టడం సాధారణమే. ఒక లీటరు నీటిలో 3 చెంచాల వెనిగర్ కలిపి ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తే మంచు తొలగిపోతుంది, బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
ఒక కప్పులో నీటిని ఫ్రీజర్‌లో గడ్డకట్టించి, దానిపై ఒక నాణెం ఉంచండి. మీరు తిరిగి వచ్చాక నాణెం పైనే ఉంటే ఫ్రిజ్ సరిగ్గా పనిచేసినట్లు. కిందకు వెళ్తే కరెంట్ పోయినట్లు.
55
మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిపోయిందా?
ఫ్రిజ్ డోర్, బాడీ మధ్య అల్యూమినియం ఫాయిల్ ముక్కను ఉంచండి. అది సులభంగా బయటకు వస్తే సీల్ బాగాలేనట్లే. హెయిర్ డ్రయ్యర్‌తో వేడి చేస్తే రబ్బరు మృదువుగా మారి అతుక్కుంటుంది.