మొలకలు ఆరోగ్యానికి మంచివే.. కానీ అతిగా తింటే మాత్రం ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త..

Published : Oct 11, 2022, 01:55 PM IST

మొలకల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ప్రోటీన్ల పవర్ హౌస్ అంటారు. అందుకే చాలా మంది వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటుంటారు.   

PREV
15
మొలకలు ఆరోగ్యానికి మంచివే.. కానీ అతిగా తింటే మాత్రం ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త..

ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, ధాన్యాలను ఎక్కువగా తినాలి. మొలకెత్తిన పెసర పప్పులో కాల్షియం,  ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. పెసర పప్పులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాటిని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుంది. మొలకెత్తిన పెసర్ల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకుందాం పదండి..
 

25

మొలకెత్తిన పెసర్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ వీటిని మన శరీరం అంత తొందరగా జీర్ణం చేసుకోలేదు. దీనివల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం, హేమోరాయిడ్లు వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుున్నారు. పెసర పప్పులో ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ ఆయుర్వేదంలో ధాన్యాలు వాతాన్ని పెంచుతాయి.

35

ముడి లేదా వండని ధాన్యాలు ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ , పిల్లలు, వృద్ధులతో సహా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి మొలకలు ఫుడ్ పాయిజన్ కు దారితీస్తాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. మూత్రపిండాలు బలహీనంగా ఉండేవారు వీటిని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

45

సున్నితమైన గట్ ఉన్నవారు ధాన్యాలను తినడం సేఫ్ కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గింజలు అంత సులువుగా జీర్ణం కావు. అలాగే వీటిని తింటే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. పైల్స్ తో బాధపడేవారు పచ్చి పెసరపప్పును తింటే పరిస్థితి మరింత దిగజారుతుంది. 

55


పెసర పప్పును ఎవరు తినకూడదు?

ఆరోగ్య నిపుణుల ప్రకారం..  చాలా మంది మొలకలను ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని పేలవమైన జీర్ణక్రియ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా పిత్త స్వభావం ఉన్నవారు వీటిని తినడం అంత మంచిది కాదు. కఫం సమస్య ఉన్నవారు కూడా మొలకలను అంత సులువుగా జీర్ణించుకోగలుగుతారు. కానీ వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తినాలి.  అంతకంటే ఎక్కువ సార్లు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన పెసరపప్పు తొందరగా జీర్ణం కావాలంటే దానిలో కొబ్బరినూనె, లేదా నెయ్యి లేదా వెన్న, జీలకర్ర, అజ్వైన్, ఎండు అల్లం పొడి వంటి సుగంధ ద్రవ్యాలతో వండి తినొచ్చు. 
 

Read more Photos on
click me!

Recommended Stories