ప్రోటీన్ ఫుడ్ ను మరీ ఎక్కువగా తింటున్నారా? ఈ రోగాలొస్తయ్ జాగ్రత్త..

Published : Jul 28, 2022, 11:59 AM IST

ప్రోటీన్ ఫుడ్ తోనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలా అని ప్రోటీన్ ఫుడ్ ను మరీ ఎక్కువగా తింటే ఎన్నో భయంకరమైన రోగాలొచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.    

PREV
17
 ప్రోటీన్ ఫుడ్ ను మరీ ఎక్కువగా  తింటున్నారా?  ఈ రోగాలొస్తయ్ జాగ్రత్త..

ప్రోటీన్ ఫుడ్ మన శరీరానికి అత్యవసరం. దీని ద్వారానే శరీర ఎదుగుదల బాగుంటుంది. మెదడు పనితీరు బాగుంటుంది. అంతేకాదు ప్రోటీన్ ఫుడ్ శరీర కణజాలాలను నిర్మించడానికి చాలా అవసరం కూడా. ఈ ఫుడ్ తోనే జట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.  గోర్ల ఆరోగ్యానికి కూడా ప్రోటీన్ ఫుడ్ అవసరం. మొత్తంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుంటే ఎన్నో రకాల రోగాలు సోకడంతో పాటుగా శరీరం శక్తిలేకుండా తయారవుతుంది. దీంతో  ఎప్పుడూ అలసిపోయినట్టుగానే ఉండటం, జుట్టు ఊడిపోవడం, చర్మం పాలిపోవడం, ముడతలు పడటం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అలా అని ప్రోటీన్ ఫుడ్ ను మితిమీరి తిన్నా కూడా శరీరానికి హాని జరుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

27
protein

ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే పోరాడే ప్రతిరోధకాలను నిర్మించడానికి, కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి, కొత్త కణాలను పుట్టించడానికి ప్రోటీన్ అవసరం. కానీ అధిక ప్రోటీన్ స్థాయిలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.

37

ప్రోటీన్ ఫుడ్ ను దీర్ఘకాలం పాటు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మూత్రపిండాలు, ఎముకలు, కాలేయం, జీవక్రియ లపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అంతేకాదు ప్రమాదకరమైన గుండెజబ్బులు, క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని ఆయుర్వేద, గట్ హెల్త్ కోచ్ డాక్టర్ డింపుల్ జంగ్డా చెప్పారు.

47
protein

ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటే.. మలబద్ధకానికి దారితీస్తుంది. అంతేకాదు ఇది జీర్ణవ్యవస్థను నాశనం చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. అలాగే mild dehydration కు కూడా దారితీస్తుంది. 

57

మొక్కలు,  పాల ఉత్పత్తుల ద్వారా లభించే ప్రోటీన్ల కంటే మాంస ద్వారా లభించిన ప్రోటీన్ యే మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

67

కార్బోహైడ్రేట్లు హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. కార్బోహైడ్రేట్లు శరీరానికి అందకపోతే ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. దీంతో ఏకాగ్రత కూడా తగ్గుతుంది.  

77

కార్బోహైడ్రేట్లను తక్కువగా.. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకునే వారు మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్య బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆహారం వల్ల ఫైబర్ లోపించి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే జీర్ణ రుగ్మతలకు కారణమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories