ఇది తెలిస్తే.. రోజూ నిమ్మరసం తాగరు

First Published | Sep 12, 2024, 1:50 PM IST

ఉదయాన్నే పరిగడుపున నిమ్మరసం తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ దీన్ని రోజూ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
 

నిమ్మరసంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, సోడియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. 

Lemon water

చాలా మందికి నిమ్మరసాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది గోరువెచ్చని నీటిలో నిమ్మసరం, తేనె కలుపుకుని తాగుతుంటారు. మరికొంతమంది చల్ల నీళ్లలో కేవలం నిమ్మసరం కలుపుకుని తాగుతుంటారు. ఎందుకంటే ఇది బరువును తగ్గిస్తుంది.

అలాగే పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది. ఇవే కావు నిమ్మరసం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నిమ్మరసం రోజూ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


నోటి పూత

నోటి పూత ఎన్నో కారణాల వల్ల వస్తుంది. కానీ వీటిలో నిమ్మకాయ కూడా ఉంది. అవును నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటిని ప్రభావితం చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.  అంటే నిమ్మరసాన్ని రోజూ తాగితే నోటి పూతల ప్రమాదం చాలా పెరుగుతుంది. మీకు ఇప్పటికే నోటి పూత ఉంటే నిమ్మరస్నాని తాగకండి. 

మైగ్రేన్

మైగ్రేన్ సమస్య చాలా మందికి ఉంటుంది. కానీ ఈ మైగ్రేన్ నొప్పిని భరించడం చాలా కష్టం. ఇది గంటల నుంచి రోజుల వరకు అలాగే ఉంటుంది. అయితే రోజూ నిమ్మరసాన్ని తాగితే కూడా మీకు మైగ్రేన్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిమ్మకాయలో ఉండే థైరామిన్ అనే అమైనో ఆమ్లం మైగ్రేన్లకు కారణమవుతుంది.

పొత్తికడుపు నొప్పి

చాలా మంది బరువు తగ్గాలని రోజూ నిమ్మరసాన్ని బాగా తాగుతుంటారు. కానీ మీరు రోజూ నిమ్మరసం తాగితే  మీ శరీరంలో విటమిన్ సి బాగా పెరుగుతుంది. దీనివల్ల మీ కడుపులో యాసిడ్ స్రావం పెరుగుతుంది. దీంతో వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. 

దంతాలు దెబ్బతింటాయి

దంతాల సమస్యలున్న ఉన్నవారు నిమ్మరసాన్ని వీలైనంత తక్కువగా తాగాలంటారు నిపుణులు. నిమ్మకాయ రసం మీ దంతాలను కూడా దెబ్బతీస్తుంది. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం దంతాలను బలహీనపరుస్తుంది. దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

డీహైడ్రేషన్

నిజానికి నిమ్మరసం మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కానీ నిమ్మరసాన్ని ఎక్కువగా తాగితే మూత్రానికి ఎక్కువ సార్లు వెల్లాల్సి వస్తుంది. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్లడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో మీ శరీరం డీహైడ్రేష్ బారిన పడుతుంది. 

గుండెల్లో మంట

నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ నిమ్మరసం కడుపులో ఆమ్లం ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ గుండెల్లో మంట వస్తుంది. అలాగే  యాసిడ్ రిఫ్లక్స్ సమస్య బారిన పడతారు. 
 

click me!