ఆముదం నూనె మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నూనెను చర్మం, జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ నూనె మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదల, రాటడం, తెల్ల జుట్టు వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ నూనెలో రిసినోలిన్ ఆమ్లం వంటి పదార్ధాలు ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఈ నూనె ఆర్థరైటిస్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ ఆముదం నూనె క్యాప్సూల్ ను వరుసగా నాలుగు వారాల పాటు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఆముదం నూనె రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ నూనె ఏదైనా బ్యాక్టీరియా సంక్రమణను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ నూనె వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..? ఈ నూనె వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.