నాటు కోడి గుడ్డు తినాలా.. లేక ఫారం కోడి గుడ్లా.. ఏ గుడ్డు మన ఆరోగ్యానికి మంచిది..?

Published : Mar 20, 2022, 04:53 PM IST

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫారం కోడిగుడ్డైనా.. నాటు కోడి గుడ్డైనా .. ఎలాంటి తేడాలు ఉండవట. వీటిలో ఏ గుడ్డు తిన్నా పెద్దగా తేడా ఉండదట. 

PREV
17
నాటు కోడి గుడ్డు తినాలా.. లేక  ఫారం కోడి గుడ్లా.. ఏ గుడ్డు మన ఆరోగ్యానికి మంచిది..?

నాటు కోడి కూర, ఫారం కోడి కూరల్లో ఏది నీకు ఇష్టమంటే ఏం చెప్తారు.. మెజారిటీగా నాటు కోడి కూరను తినడానికే మొగ్గుచూపుతారు కదూ. నాటి కోడికూరకున్న టేస్ట్ ఫారం కోడి కూరకు రాదు. అందుకే చాలా మందికి నాటు కోడికూరంటే ఇష్టముంటుంది. అయినా   నాటు కోళ్లు.. ఫారం కోళ్ల మాదిరిగా పెరగవు. అందులోనూ ఫారంకోళ్ల మాదిరిగా నాటుకోళ్లకు తొందరగా పెరగడానికి  ఎలాంటి మందులు ఇవ్వరు.

27

ఇకపోతే గుడ్డు విషయానికొస్తే.. గుడ్డు పోష్టికాహారం. ఇందులో ఉండే మాంసకృత్తులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. 

37

గోధుమలు, పప్పులు, జియ్యంలోని ప్రోటీన్ విలువతో పోల్చితే గుడ్డులోనే ఇవి ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిలో ప్రోటీన్ల స్థానంలో గుడ్డే మొదటి స్థానంలో నిలిచింది. గుడ్ల తర్వాతి స్థానంలో పాలు, మాంసాహారం స్థానం సంపాదించుకున్నాయి. 

47

పప్పుల్లో ఉండే ప్రోటీన్లతో పోల్చితే గుడ్డులోని ప్రోటీన్లే చాలా తొంతరగా జీర్ణమవుతాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును ఇవ్వండి. అలాగే పాలు కూడా తాగించండి.

57

పెద్దవారిలో ప్రోటీన్ లోపం ఏర్పడకూడదంటే.. రోజుకు ఒక గుడ్డును తినాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీరి కండరాలు బలంగా ఉండాలంటే  తరచుగా గుడ్డును తినాలి. 

67
egg

పలు అధ్యయనాల ప్రకారం.. మన దేశంలో వారానికి ఒక గుడ్డు తినే వారు చాలా మందే ఉన్నారట. 47 శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. అలాగే తక్కువ బరువు ఉన్నారట. అందుకే మన దేశంలో గుడ్డు వినియోగం పెంచాలని చెబుతోంది. ఒక వ్యక్తి వారానికి ఐదు నుంచి ఆరు గుడ్లను తినాలని వైద్యులు చెబుతున్నారు. 

77

నాటు కోడి మాదిరిగా నాడు కోడిగుడ్లలో ఎక్కువ పోషకాలుంటాయని, అవే బలవర్ధకమైనవని అంటుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఫారం కోడిగుడ్డైనా.. నాటుకోడి గుడ్డైనా.. పోషకాలు ఒకే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏ గుడ్డు తిన్నా.. పోషకాలు పుష్కలంగా అందుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories