మొటిమలు, నల్లని మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా..? అయితే అరటి తొక్కతో ఇలా చేయండి..

Published : Mar 20, 2022, 03:25 PM IST

అరటిపండులో బోలెడు పోషకాలుంటాయని మనందరికీ ఎరుకే. అలాగే అరటి తొక్కలో కూడా ఎన్నో ఔషదగుణాలున్నాయి. దీనితో ముఖంపై మొటిమలు, మచ్చలను ఇట్టే తొలగించుకోవచ్చు.   

PREV
19
మొటిమలు, నల్లని మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా..? అయితే అరటి తొక్కతో ఇలా చేయండి..

మెరుగైన ఆరోగ్యానికి అరటి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే డాక్టర్లు.. ప్రతి రోజు ఒక అరటిపండును ఖచ్చితంగా తినాలని సలహాలనిస్తుంటారు. 

29

అరటిపండు మన స్కిన్ కు మాయిశ్చరైజర్ లా కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో ఎలాంటి కెమికల్స్ కలవవు. ముఖ్యంగా దీనిని వాడటం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న అనుమానం కూడా ఉండదు. దీనిని చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు కూడా. 
 

39

అందంగా కనిపించడానికి కెమికల్స్ మిక్స్ చేసిన మార్కెట్ ప్రొడక్ట్స్ కంటే.. నేచురల్ గా లభించేవే మన స్కిన్ ను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు వీటితో మీ అందం రెట్టింపు అవుతుంది కూడా. 

49

అరటి పండే కాదు అరటితొక్కతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ అరటి తొక్కలో ఎన్నో దివ్య ఔషదగుణాలున్నాయి. వీటితో ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

59

అరటి తొక్కలో సిలికా అనే కాంపౌండ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. 

69
Acne_problem

ఈ తొక్కలో ఫినోలిక్స్ అనే దానిలో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా మెండుగా ఉంటాయి. వీటివల్ల కొల్లెజెన్  ఉత్పత్తి అవుతుంది. దాంతో ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. 

79

ఇందుకోసం ముఖానికి అరటి తొక్క లోపలి భాగంలో ఉండే తెల్లని పొరను స్కిన్ కు రుద్దండి. ముఖం మొత్తం ఈ తొక్కను రుద్దిన నాక ఒక పదిహేను నిమిషాలు దాన్ని అలాగే వదిలేసి ఆ తర్వాత ఫేస్ ను చల్లని లేదా గోరు వెచ్చని నీళ్లతో కడగండి. 
 

89

అరటితొక్కలో యాంటీ యాక్సిడెంట్స్ , న్యూట్రియన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ముఖాన్ని కాంతివంతంగా, తాజాగా చేసేందుకు ఎంతో సహాయపడతాయి. ముడతలు కూడా రావు. ఒకవేళ ముడతలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. 

99
pimples

అంతేకాదు అరటి తొక్కను తరచుగా ఫేస్ కు అప్లై చేస్తుంటే స్కిన్ డ్రైగా మారే సమస్యే రాదు.  కాబట్టి సమయం దొరికినప్పుడల్లా.. అరటితొక్కను ఫేస్ కు అప్లై చేస్తూ ఉండండి. మీ చర్మ సమస్యలన్నీ ఇట్టే తగ్గిపోతాయి. మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న వారు ఈ తొక్కను తరచుగా ఉపయోగిస్తూ ఉండండి. ఈ సమస్యలు తొందరగా తగ్గుతాయి.  

click me!

Recommended Stories