Self Respect Wedding: పంతులు, వేదమంత్రాలు, రిజిస్ట్రేషన్ అవసరం లేని కొత్త పెళ్లి పద్ధతి.. ఇప్పుడిదే ట్రెండింగ్

Published : Nov 18, 2026, 12:24 PM IST

Self Respect Wedding: ఇప్పుడు కొత్త పెళ్లి పద్ధతి ట్రెండ్ అవుతోంది. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్. అనిరుధ్ రవి చందర్, కావ్య మారన్ పెళ్లి ఇదే పద్ధతిలో జరిగింది. అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్ అంటే ఏమిటి?

PREV
13
సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్ అంటే ఏమిటి?

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, వ్యాపారవేత్త కావ్య మారన్ చేసుకున్న 'సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్' (ఆత్మగౌరవ వివాహం) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి పూజారులు, వేద మంత్రాలు, సంప్రదాయ తంతులు లేకుండా ఎంతో నిరాడంబరంగా జరిగే పెళ్లి పద్ధతి ఇది. స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వధూవరులు ఇద్దరూ పరస్పర అంగీకారంతో దండలు, ఉంగరాలు మార్చుకుని ఒక్కటవుతారు. కుల వివక్ష, పురుషాధిక్యత, అనవసరపు ఆర్భాటాలను వ్యతిరేకిస్తూ 1925లో తమిళనాడులో సంఘ సంస్కర్త పెరియార్ ఈ ఆత్మగౌరవ వివాహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తమిళంలో దీన్ని 'సుయమరియాదై తిరుమణం' అని పిలుస్తారు. భార్యాభర్తల మధ్య సమానత్వం, గౌరవాన్ని పెంపొందించడమే ఈ వివాహ ప్రధాన ఉద్దేశం.

23
ఈ పెళ్లికి చద్ధబద్ధత

అయితే ఈ వివాహ పద్ధతి వెనుక ఉన్న చట్టపరమైన అంశాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. 1955 నాటి హిందూ వివాహ చట్టంలో సెక్షన్ 7-A సవరణ ద్వారా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మాత్రమే ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించారు. వరుడికి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు నిండి ఉండి, ఇద్దరూ హిందూ మతానికి (బౌద్ధ, జైన, సిక్కు మతాలతో సహా) చెందిన వారైతేనే ఈ చట్టం వర్తిస్తుంది. వేర్వేరు మతాలకు చెందిన వారు ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు; వారు ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు లేదా పుదుచ్చేరి సరిహద్దుల్లో జరిగే ఆత్మగౌరవ వివాహాలు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయి.

33
మన రాష్ట్రాల్లో మాత్రం వేరు

తమిళనాడు, పుదుచ్చేరి దాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లో ఈ తరహాలో పంతులు లేకుండా పెళ్లి చేసుకుంటే సెక్షన్ 7-A కింద నేరుగా చట్టబద్ధత లభించదు. అలాంటి వారు తప్పనిసరిగా రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేసుకోవాలి. పెద్దల వ్యతిరేకత ఉన్న ప్రేమికుల రక్షణ దృష్ట్యా, ఈ వివాహాలను బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం లేదని 2023లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆడంబరాలకు దూరంగా, కేవలం ప్రేమ, సమానత్వంతో ఒక్కటవ్వాలనుకునే నేటి యువతకు ఈ వివాహ విధానం ఎంతో ఆకర్షణీయంగా మారుతోంది. అధికారిక గుర్తింపు కోసం పెళ్లి తర్వాత వివాహ ధృవీకరణ పత్రం తీసుకోవడం మాత్రం తప్పనిసరి.

Read more Photos on
click me!

Recommended Stories