మైనర్ తో స్కూటర్ రైడ్ - వైర‌ల్ వీడియో - మీ పిల్ల‌లకు వాహ‌నం ఇస్తే శిక్ష ఏంటో తెలుసా?

First Published Oct 25, 2024, 4:44 PM IST

New RTO Rules on Minor Driving: ఒక వ్య‌క్తి ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతూ మైన‌ర్ బాలిక‌తో స్కూట‌ర్ రైడ్ చేయించాడు. బాలిక స్కూట‌ర్ న‌డుపుతుండ‌గా, ఆ వ్య‌క్తి వెనుక కూర్చుని ఉన్నాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్  గా మారింది. ఈ నేరానికి ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా?  

minor driving license

New RTO Rules on Minor Driving: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన మరో కేసులో ఓ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇందులో ఒక వ్యక్తి చిన్నారిని స్కూటర్ నడపడానికి అనుమతిస్తున్నాడు. అతను వెనుక సీట్లో హాయిగా కూర్చుని ఉండగా.. మైన‌ర్ స్కూట‌ర్ న‌డుపుతూ ఉంది. ఈ వీడియోలో ఒక చోట వెనుక కూర్చున్న వ్య‌క్తి కెమెరా వైపు చిరునవ్వు చిందిస్తూ తన చేతిని ఊపాడు.

పాఠశాల యూనిఫాం ధరించి, కొత్త టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌ను ఆ చిన్నారి న‌డుపుతోంది. అలాగే, రైడర్, వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ పబ్లిక్ రోడ్‌లో హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. అనేక‌ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల జాబితాలో ఇది మరొక నేరం. అయితే, ముందు లేదా వెనుక నంబర్ ప్లేట్ లేకపోవడంతో వాహనం గుర్తించడం కష్టం. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల జాబితాలో ఇది మరొక నేరం. 

సోష‌ల్ మీడియా ఫైర్ 

మైన‌ర్ వాహ‌నం న‌డుపుతుండ‌గా, వెనుక సీట్లో వ్య‌క్తి చిరున‌వ్వులు చిందిస్తూ కూర్చోవ‌డం క‌నిపించిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో నెటిజ‌ట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చాలా అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించిన తీరుపై మండిప‌డుతున్నారు. ఆ వ్య‌క్తి తన బిడ్డతో పాటు తోటి వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నేరానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.

ఒక నెటిజ‌న్ స్పందిస్తూ.. "తండ్రి చాలా ప్లానింగ్ చేసాడు. తెలివైనవాడు.. నంబర్ ప్లేట్ కూడా తొలగించాడు.. ఫిర్యాదులు లేవు, ఆరోపణలు లేవు" అని పేర్కొన్నాడు. మరొక యూజ‌ర్ "దయచేసి ఎవరైనా ఆ వ్యక్తిని జైల్లో పెట్టండి!" అటూ కామెంట్ చేశాడు. 

Latest Videos


minor driving

మైన‌ర్ బైక్ రైడ్ పై చట్టం ఏమి చెబుతుంది? 

భారతదేశంలో మోటరైజ్డ్ వాహనాలకు చట్టపరమైన డ్రైవింగ్ వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.  ఆ ప్రాంత RTO ద్వారా ఆమోదం పొందిన చట్టపరమైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం కూడా చట్టం ప్రకారం అవసరం. మోటారు వాహనాల చట్టం 1914 ప్రకారం భారతదేశంలో వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ తప్పనిసరి.

2012లో సుప్రీం కోర్టు అన్ని వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లను (హెచ్‌ఎస్‌ఆర్‌పి) తప్పనిసరి చేసింది. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు, ప్రయాణీకుల రైడింగ్ కూడా చాలా ముఖ్యం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇది చట్టం ప్రకారం తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

minor driving 2

తల్లిదండ్రులకు జరిమానాలు, జైలు శిక్ష 

మోటారు వాహనాన్ని నడపడానికి లేదా ఆపరేట్ చేయడానికి మైనర్‌ను అనుమతిస్తే త‌ల్లిదండ్రుల‌పై చ‌ర్య‌లు ఉంటాయ‌ని చ‌ట్టం చెబుతోంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఈ నేరం కింద జైలు శిక్ష కూడా విధించ‌వ‌చ్చు.

పిల్ల‌లు వాహ‌నాలు న‌డిపితే మోటారు వాహన చ‌ట్టం ప్ర‌కారం నేరానికి పాల్పడిన బాలుడి సంరక్షకుడు లేదా వాహనం యజమాని దోషిగా పేర్కొంటారు. చ‌ట్టం ప్ర‌కారం వారికి శిక్ష‌లు ఉంటాయి. వాహ‌నం య‌జ‌మాని డ్రైవిడ్ లైసెన్స్ ను కూడా ర‌ద్దు చేస్తారు. జ‌రిమానాలు విధిస్తారు. 

minor driving 3

మైన‌ర్ డ్రైవింగ్ కు ఎలాంటి శిక్ష విధిస్తారు? 

మైనర్ డ్రైవింగ్ చేసే విషయానికి వస్తే మైనర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పట్టుబడితే ఇండియన్ జ్యుడిషియల్ కోడ్ సెక్షన్ 125 ప్ర‌కారం రూ. 25,000 వరకు జరిమానా విధించబడుతుంది. వాహనం  రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. అలాగే, అతను 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొంద‌డానికి అన‌ర్హుడుగా ఉంటాడు. మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఏదైనా రోడ్డు ప్రమాదానికి కారణం అయితే, మరిన్ని శిక్షలు విధించే విధంగా కొత్త చట్టాల్లో మార్పలు తీసుకువచ్చింది భారత ప్రభుత్వం.

click me!