రోజూ 30 నిమిషాలు నడిచినా ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 25, 2024, 4:11 PM IST

నడక మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొంతమంది హెల్తీగా ఉండాలని వాకింగ్ చేస్తే.. మరికొంతమంది బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తుంటారు. కానీ మీరు ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 

30 నిమిషాల వాకింగ్ ప్రయోజనాలు

మన తాతలు,ముత్తాతలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి కారణం వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లే. కానీ ఇప్పటి మనుషులు బలంలేక, ఏ పనిచేతకాక, చిన్నకే నీరసంగా మారిపోతున్నారు. 

శారీరక శ్రమ లేని జీవనశైలి వల్ల ఈ రోజు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, మొబైల్‌ ఫోన్లను ఎక్కువ సేపు చూడటం వంటివి ఇందుక అసలు కారణాలంటున్నారు నిపుణులు. 

30 నిమిషాల నడక ప్రయోజనాలు

ఆరోగ్యకరమైన ఆహారం తింటూ.. రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. మీకు తెలుసా? వాకింగ్ వల్ల శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయమం కలుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అర్థగంట పాటు నడిస్తే మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


30 నిమిషాల నడక ప్రయోజనాలు

రోజూ 30 నిమిషాలు నడిస్తే కలిగే ప్రయోజనాలు:

1. గుండె ఆరోగ్యం: ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడిస్తే  మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మీ  గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. దీనివల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అలాగే ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

2. మెరుగైన జీర్ణక్రియ : మీరు గనుక ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీరు రాత్రిపూట తిన్న తర్వాత కొద్దిసేపు నడిస్తే తిన్నది బాగా జీర్ణమవుతుంది. అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 

3. రోగనిరోధక శక్తి పెరుగుదల: మీరు రెగ్యులర్ గా 30 నిమిషాల పాటు నడిస్తే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వాకింగ్ మీ శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరిగేలా చేస్తుంది. 

30 నిమిషాల నడక ప్రయోజనాలు

4. మెదడు ఆరోగ్యం మెరుగు: రెగ్యులర్ గా  మీరు గనుక అర్థగంట పాటు నడిస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వాకింగ్ వల్ల మెదడు కణజాల పరిమాణం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి సంభవించవు.

5. బరువు తగ్గుతారు: వాకింగ్ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకు బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా వాకింగ్  చేయండి. నిపుణుల ప్రకారం.. బరువు తగ్గాలనుకునేవారు ఒక నిర్దిష్ట దూరం నడిస్తే మంచి ఫలితాలను పొందుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే రోజూ 30 నిమిషాలు నడవండి.

30 నిమిషాల నడక ప్రయోజనాలు

6. ఆయుష్షు పెరుగుతుంది: పలు అధ్యయనాల ప్రకారం.. మీరు ప్రతిరోజూ నడస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వారి ఆయుష్షు 5-7 సంవత్సరాలు పెరుగుతుంది.

7. మధుమేహం నియంత్రణ: చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల  నేడు చాలా మందికి డయాబెటీస్ వస్తుంది. అయితే మీరు గనుక ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

click me!