చపాతీలు పూరీల్లా ఉబ్బి, మెత్తగా అవ్వాలంటే పిండిలో ఇదొక్కటి కలపండి

First Published | Oct 25, 2024, 3:41 PM IST

చాలా మంది చేసే చపాతీలు గట్టి గట్టిగా వస్తుంటాయి. ఇవి మెత్తగా అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. కానీ పిండిలో ఒకటి వేసి కలిపి చేస్తే మాత్రం చపాతీలు పూరీల్లా ఉబ్బి, మెత్తగా అవుతాయి. 

chapati

హోటల్లో రోటీలు, చపాతీలు చాలా మెత్త మెత్తగా అవుతాయి. ఇలా ఇంట్లో కూడా రావాలని  ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చపాతీలు అస్సలు మెత్తగా రావు. అలాగే గుండ్రంగా కూడా రావు. ఒకవేళ చపాతీలు గుండ్రంగా, మెత్తగా వస్తే ఆడవాళ్ల ఆనందానికి అవదులు అసలే ఉండదు.

పిండిని సరిగ్గా కలపకపోతే కూడా చపాతీలు సరిగ్గా రావు.  మీకు పిండిని సరిగ్గా కలపడం రాకపోతే చపాతీలు మెత్తగా రావు అలాగే ఉబ్బవు. అయితే రెస్టారెంట్లు, దాబాల్లో అయితే చపాతీ పిండిలో మైదా పిండిని కలుపుతారు. దీంతో చపాతీలు మెత్తగా వస్తాయి. అయితే ట్రిక్స్ ను ఫాలో అయితే మీరు చేసే చపాతీలు కూడా మెత్తగా, బెలూన్ లా ఉబ్బుతాయి. 

chapati

బేకింగ్ పౌడర్ 

చపాతీ పిండిలో బేకింగ్ పౌడర్ ను కలిపితే కూడా మీరు కోరుకున్నట్టు చపాతీలు వస్తాయి. ఇందుకోసం పొడి చపాతీ పిండిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ ను వేయండి. ఆ తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలపండి. బేకింగ్ పౌడర్ వల్ల చపాతీలు బాగా మెత్తగా వస్తాయి. అలాగే పూరీల్లా ఉబ్బుతాయి. 

ఇందుకోసం ఏం చేయాలి? 

గోధుమ పిండిలో 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్ ను వేసి పిండిని బాగా కలపండి. నీళ్లు కలిపే ముందే బేకింగ్ పౌడర్ ను కలపాలి. లేకపోతే ఈ బేకింగ్ పౌడర్ ఒకేచోట ఉంటుంది.

దీని తర్వాత పిండిని మృదువుగా చేయడానికి దీంట్లో నీళ్లు కావాల్సిన నీళ్లను పోసి కలపండి. బేకింగ్ పౌడర్ పిండిని గుజ్జు చేయడానికి సహాయపడే ఒక పదార్ధం. ఇది నీటితో ఉత్తేజితమై రోటీని మృదువుగా చేస్తుంది. 
 


పెరుగుతో బేకింగ్ పౌడర్ కలపండి

పిండిని కలిపేటప్పుడు దాంట్లో కొంచెం పెరుగును వేసి కలపండి. ఆ తర్వాత పిండిని అరచేతితో బాగా కలుపుతూ ఉండండి. పెరుగు, బేకింగ్ సోడా గోధుమ పిండిని ఫ్లెక్సిబుల్ గా చేస్తాయి. అలాగే చపాతీని మెత్తగా చేయడానికి సహాయపడతాయి. 

ఇందుకోసం చేయాల్సింది? 

1 టేబుల్ స్పూన్ పెరుగులో 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్ ను వేసి కలపండి.  ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి బాగా కలపండి. ఆ తర్వాత పిండిని గోరువెచ్చని నీటితో తడిపి ముద్దలా చేయండి.

చపాతీలు చేసే ముందు పిండిని 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. పెరుగు, బేకింగ్ పౌడర్ మిశ్రమం పులియబెట్టే ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీంతో చపాతీలు మెత్తగా అవుతాయి. బాగా ఉబ్బుతాయి. 
 

బేకింగ్ పౌడర్, పాలు 

గోధుమ పిండిని నీళ్లతో కాకుండా పాలతో కలపండి. దీనివల్ల రోటీలు మెత్తగా వస్తాయి. అలాగే ఇవి పూరీల్లా ఉబ్బుతాయి. అలాగే బేకింగ్ పౌడర్ ను పాలలో కలిపి పిండిని కలిపితే.. పాలలో ఉండే ప్రోటీన్లు పిండిని మృదువుగా చేయడానికి సహాయపడతాయి. 

ఇందుకోసం ఏం చేయాలి? 

ఒక కప్పు గోరువెచ్చని పాలను తీసుకుని దాంట్లో 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్ ను కలపండి. ఈ పాలను కొన్ని కొన్నిగా పిండిలో పోసి కలపండి.

దీన్ని చపాతీలు చేయడానికి ముందు 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచండి. పాలు పిండిని మెత్తగా చేయడానికి సహాయపడతాయి. అయితే బేకింగ్ పౌడర్ రోటీని ఎక్కువసేపు మెత్తగా, మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

Latest Videos

click me!