ఇంట్లో ఈజీగా చేసే సంక్రాంతి స్పెషల్ స్వీట్స్.. మీరూ ట్రై చేయండి..

First Published Jan 14, 2023, 12:55 PM IST

సంక్రాంతి పండుగకు గుమగుమలాడే పిండి వంటలతో పాటుగా... నోరూరించే స్వీట్స్ కూడా చాలా స్పెషల్. ఇంట్లోనే చాలా సులువుగా, ఫాస్ట్ గా చేసుకునే కొన్ని స్వీట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పవిత్రమైన మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. పంజాబ్, గుజరాత్ నుంచి మహారాష్ట్ర, తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం ఈ పండుగను తమదైన రీతిలో జరుపుకుంటుంది. ఈ పండుగ పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. రోజులు కూడా ఎక్కువ కావడం ప్రారంభిస్తాయి. సూర్యుడు ఉత్తరం వైపు కదులుతూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. సంక్రాంతి పండగకు తీరొక్క పిండివంటలను చేస్తుంటారు. అంతేకాదు ఈ పండుగకు నోరూరించే తీపివంటకాలను కూడా తయారుచేస్తుంటారు. ఈ మకర సంక్రాంతి సందర్భంగా కొన్ని సాంప్రదాయ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వుల లడ్డూలు

నువ్వులు, బెల్లంతో తయారు చేసే నువ్వుల లడ్డూ మకర సంక్రాంతికి స్పెషల్ స్వీట్. నిజానికి నువ్వులు మన శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. వీటి రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ తియ్యని  లడ్డూలను వడ్డించేటప్పుడు 'తిల్-గుల్ గయా, ఆనీ గోడ్-గోడ్ బోలా' అనే ప్రసిద్ధ మహారాష్ట్ర పదబంధాన్ని ఉపయోగిస్తారు. అంటే 'తిల్ బెల్లం తినండి, బాగా మాట్లాడండి అని అర్థం.
 

బెల్లం పట్టి

జస్ట్ బెల్లం,  వేరుశెనగలను ఉపయోగించి తయారు చేసిన ఈ స్వీట్ కూడా సంక్రాంతికి ఎక్కువగా తయారుచేస్తారు. గుర్ అని కూడా పిలువబడే బెల్లం మకర సంక్రాంతి సమయంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఈ పండుగకు చాలా మంది బెల్లాన్ని కూడా దానం చేస్తుంటారు. 
 

మకర చౌలా

మకర చౌలాను బెల్లం, పాలు, అరటి, చెరకుతో పాటుగా కొత్త బియ్యంతో వండుతారు. ఇది ఒడియో సంప్రదాయంలో భాగం. దీన్ని మొదటగా దేవుడికి సమర్పిస్తారు. ఆ తర్వాత అందరికీ ప్రసాదంగా పంచుతారు. 
 

పాయసం

పాయసాన్ని ఇష్టపడని వారెవరూ ఉండరు. పాయసాన్ని సాధారణంగా పంచదారకు బదులు బెల్లంతో తయారుచేస్తారు. ఈ మందపాటి పుడ్డింగ్ లాంటి డెజర్ట్ నిజంగా తినడానికి మంచి విందనే చెప్పాలి.
 

పురాన్ పోలి

పూరన్ పోలి అనేది పండుగలకు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే చేసే మహారాష్ట్ర వంటకం. ఇది ఒక రకమైన తీపి పరాఠా. దీనిలో పెసరపప్పు, బెల్లం మిశ్రమం ఉంటుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. 

కిచిడీ

కిచిడీని సాధారణంగా మకర సంక్రాంతి పండుగకు తప్పకుండా వండుతారు. పెసరపప్పు, అన్నంతో తయారు చేసిన ఈ వంటకం నెయ్యితో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉంటుంది. 
 

పిన్ని

పిన్ని పంజాబీ నుంచి వచ్చిన రుచికరమైన స్వీట్. దీనిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్  పుష్కలంగా ఉంటాయి. ఈ లడ్డూలను గోధుమ పిండి, పంచదార లేదా బెల్లంతో తయారుచేస్తారు. 
 

చక్కర పొంగలి

చక్కర పొంగలి అనే వంటకం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా తయారుచేస్తారు. ఇది బియ్యం ఆధారిత వంటకం. దీనిని బియ్యం, పెసరపప్పు, బెల్లంతో తయారుచేస్తారు. 

click me!