సాక్షి ధోని బ్యూటీ సీక్రెట్ ఎంటో తెలిస్తే.. షాక్ అవుతారు...

First Published May 7, 2022, 1:10 PM IST

సాక్షి ధోని.. క్రికెటర్ ధోనీ భార్యగా చాలామంది ఎక్కువసార్లు మాట్లాడుకునే సెలబ్రిటీ వైఫ్ ఆమె. సాక్షికి ప్రత్యేకంగా ఓ ఫ్యాన్ బేసే ఉందంటే ఆమె ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇన్ స్టా ఖాతాలో నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

సాక్షి డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తి. అందానికి మారు పేరు. సహజసిద్ధమైన అందం ఆమె సొంతం. అయితే అందానికి సాక్షి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటి? అంటే .. 

సాక్షి తన అందానికి జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంట్లోనే హోంమేడ్ ప్యాక్ తయారు చేసుకుంటుంది. ఈ ప్యాక్ లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి గ్లిసరిన్, నిమ్మకాయ.. అంతే.. 

Latest Videos


ఈ మిశ్రమం చర్మాన్ని నిగారించేలా చేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. మృధువుగా తయారుచేస్తుంది. అందుకే సాక్షి చర్మం మెరుస్తూ ఉంటుందట.

ఫేస్ ప్యాక్ తయారీలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేచురల్ వే అయి ఉండేలా చుసుకుంటారు సాక్షి. సహజసిద్ధంగా పండించిన నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన ఫేస్ ఫ్యాక్ ను వాడుతుంది సాక్షి ధోని.

ఒక ఇంటర్వ్యూలో సాక్షి ధోని తన బ్యూటీ సీక్రెట్స్ చెబుతూ.. అందానికి మెరుగులు దిద్దుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ వంటింట్లోనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. 

చర్మసంరక్షణే కాదు.. ఆరోగ్యం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇది కూడా ఆమె సహజసిద్ధమైన అందానికి మరో కారణం. 

click me!