Mother's Day 2022: మదర్స్ డే అని కాదు.. అసలు అమ్మకు ఏం కావాలో తెలుసుకోండి..!

Published : May 07, 2022, 12:50 PM IST

Mother's Day 2022: అమ్మ అనే రెండక్షరాల పదం చిన్నదే అయినా కానీ.. ఆ పిలుపుకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు.  

PREV
17
Mother's Day 2022: మదర్స్ డే అని కాదు.. అసలు అమ్మకు ఏం కావాలో తెలుసుకోండి..!

ప్రతి ఒక్క స్త్రీకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. ఒక స్త్రీ తన చిన్నప్పటి నుంచి తన చివరి కడవరకు ఎన్నో కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొంటుంది. అంతే కాకుండా కొన్ని సంతోషకరమైన అనుభవాలు కూడా ఎదుర్కొంటుంది. అందులో ఒకటి అమ్మతనం.
 

27

ఈ అమ్మతనంలో తను ఎదుర్కొనే ప్రతి అనుభవాన్ని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక ఆ బిడ్డ పుట్టాక తను పడిన కష్టాలన్నీ మర్చిపోతుంది. ఇక ఆ బిడ్డనే తన ప్రపంచమని.. అన్ని ఆ బిడ్డ కోసమే అన్నట్లుగా ఉంటుంది. అలా తన బిడ్డ పెరిగి పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క విషయంలో తను తోడుగా ఉంటుంది. ఆ బిడ్డ కష్టాల్లో ఉంది అంటే మాత్రం ఆ కష్టాలన్నీ తనమీద వేసుకుంటుంది.

37

ఆ బిడ్డ సంతోషంగా ఉంది అంటే ఆ సంతోషానికి కారణం కూడా ఆ తల్లే అవుతుంది. ఇక బిడ్డ ఆకలిని,  ఆ బిడ్డ ఇష్టాలను ఆ బిడ్డ అడగకముందే తాను తెలుసుకొని ఆ బిడ్డ కోరికలను తీరుస్తుంది. అలా ఒక తల్లి తన బిడ్డకు చూపించే ప్రేమ ప్రతి విషయంలో అద్భుతంగా ఉంటుంది. బిడ్డ కూడా తన తల్లి విషయంలో ఎంతో ఆప్యాయతంగా, ప్రేమగా ఉంటుంది.
 

47

అలా ఒకప్పుడు ఒక తల్లి బిడ్డ మధ్య ప్రేమ అలా కనిపించింది. కానీ ఈ తరంలో చూసినట్లయితే తల్లి బిడ్డ ప్రేమను అసలు నోచుకోవడం లేదు. కారణం ఏంటంటే ఈతరం పిల్లలంతా కేవలం తమకు మాత్రమే సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకానీ తమ తల్లిదండ్రుల విషయంలో ప్రేమను చూపించడం కానీ కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు.
 

57

సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తల్లితండ్రులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం రోజులలో మాత్రం ఎక్కడ లేనంత ప్రేమని చూపిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఆ రోజు గిఫ్ట్ లను ఇచ్చి తమ తల్లిదండ్రులకు ఇటువంటి గిఫ్టులు ఇచ్చాము అన్నట్లుగా వాటిని స్టేటస్ ల ద్వారా చూపిస్తున్నారు.

67

ఆరోజు కూడా తమ తల్లిదండ్రులతో ఎక్కువ గడపరనే చెప్పాలి. కేవలం కొంత సమయాన్ని కేటాయించి మిగతా సమయాన్ని మొత్తం తమకోసమే కేటాయిస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఎటువంటివి పొందలేకపోతున్నారు. కనీసం పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు ఏమి ఇష్టమో.. తమ నుండి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో కూడా కనిపెట్టలేక పోతున్నారు.
 

77

కానీ ఇప్పటికైనా మీ తల్లిదండ్రులకు మీ ప్రేమను అందించండి. వాళ్ళు మీ నుండి ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోండి. మీరు ఏది ఇస్తే వాళ్ళు సంతోష పడతారో గుర్తించి వాళ్ళకు అది ఇవ్వండి. ఎందుకంటే తల్లి మిమ్మల్ని 9 నెలలు మోసి కని, తండ్రి మీ బాధ్యతలను నెత్తిన పెట్టుకొని నిత్యం మీ కోసం కష్టపడుతుంటారు. కాబట్టి వారి కోసం మీరు ఎంత చేసిన.. ఏమి చేసినా వాళ్ళు సంతోషంగా ఉండేటట్లు చేయాలి.

click me!

Recommended Stories