Rice vs Chapati: రాత్రిపూట అన్నం తినాలా? చపాతీ తినాలా? ఏది బెస్ట్..?

Published : Nov 17, 2026, 06:10 PM IST

Rice vs Chapati: చాలా మంది మధ్యాహ్నం అన్నం తిన్నా కూడా.. రాత్రిపూట మాత్రం చపాతీ తింటూ ఉంటారు. చపాతీ అయితే బరువు తగ్గడం ఈజీ అని నమ్ముతారు. ఏది నిజం.. రెండింటిలో ఏది తినడం ఉత్తమం..

PREV
13
Roti Vs Chapati

రాత్రి భోజనం చేసే సమయంలో మనలో చాలా మందికి వచ్చే కామన్ డౌట్.. అన్నం తినాలా? చపాతీలు తినాలా? అనేది. బరువు పెరుగుతామనే భయంతో కొందరు అన్నాన్ని పూర్తిగా పక్కన పెడితే, మరి కొందరు రాత్రిపూట అన్నం తింటేనే కడుపు తేలికగా ఉంటుందని భావిస్తారు. ఇంకొందరైతే చపాతీనే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. మరి, ఈ రెండింటిలో నిజంగా ఏది తినడం మంచిది? ఏది తింటే రాత్రిపూట సులభంగా జీర్ణం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

పగటిపూట మనం చేసే పనులతో పోలిస్తే.. రాత్రిపూట శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. నిద్రపోయే సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుంటే.. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అందుకే, రాత్రిపూట ఏం తింటున్నాం అనేదానికంటే.. ఎంత తీసుకుంటున్నాం అనేది ముఖ్యం.

23
రాత్రిపూట చపాతీ తింటే ఏం జరుగుతుంది?

సాధారణంగా గోధుమ పిండితో చేసే చపాతీల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మల్టీ గ్రెయిన్ గోధుమ పిండితో చేసినవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే, చపాతీ అందరికీ ఒకేలా జీర్ణం అవ్వదు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలివేయకుండా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, దీనిని తయారు చేసేటప్పుడు ఎక్కువ నూనె, నెయ్యి లాంటివి వేసి చేయడం వల్ల కడుపులో హెవీ ఫీలింగ్ కలుగుతుంది.

రాత్రిపూట అన్నం తింటే మంచిదా?

వైట్ రైస్ లో ఫైబర్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల మల్టీ గ్రెయిన్ గోధుమ చపాతీలతో పోలిస్తే ఇది త్వరగా జీర్ణం అవుతుంది. కడుపు తేలికగా ఉండాలని కోరుకునేవారికి ఇదే మంచి ఆప్షన్. కాకపోతే... హెవీగా కాకుండా చాలా తక్కువగా తినాలి. చపాతీతో పోలిస్తే.. సులభంగా జీర్ణం అవుతుంది. పప్పు, పెరుగు, కూరగాయలు, ప్రోటీన్ తో కలిపి తీసుకుంటే... బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది.

33
రాత్రి భోజనం చేసేటప్పుడు చేయకూడని తప్పులు ఇవి...

అన్నమైనా, చపాతీలైనా కడుపు నిండా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది.చకేవలం అన్నం లేదా చపాతీ మాత్రమే తినకుండా.. పప్పు, కూరగాయలు, పెరుగు లేదా గుడ్లను కూడా చేర్చుకోవాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల అజీర్తి, గుండెల్లో మంట వస్తాయి. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించడం మంచిది. చపాతీకి ఎక్కువ నెయ్యి రాయడం, నూనెలో వేయించిన కూరలు తినడం వల్ల రాత్రి పూట జీర్ణం కావడం కష్టమవుతుంది.

మధుమేహం ఉన్నవారు ఏం తినాలి? 

షుగర్ ఉందని రాత్రిపూట అన్నం పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. అలా అని చపాతీలు తింటే షుగర్ అస్సలు పెరగదని అనుకోవద్దు. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి ఎంత పరిమాణంలో తింటున్నారు, ఎలాంటి బియ్యం/పిండి వాడుతున్నారు అనేది ముఖ్యం. డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.

ఫైనల్ గా అన్నం, చపాతీ రెండింటిలో ఏది తినాలి అంటే.. ఆహారం సులభంగా జీర్ణమవ్వడమే ముఖ్యం అనుకుంటే అన్నం లైట్ వెయిట్ ఆప్షన్. ఎక్కువసేపు ఆకలి వేయకూడదనుకుంటే చపాతీ మంచిది. ఏది తిన్నా పరిమితంగా, కూరగాయలు, ప్రొటీన్‌తో కలిపి నిద్రపోయే ముందే తినడమే అసలైన ఆరోగ్య రహస్యం.

Read more Photos on
click me!

Recommended Stories