Bitter Gourd: చేదుగా ఉంటదని కాకరకాయ కూరను తినడం లేదా? ఛా.. మీరెన్నోప్రయోజనాలను మిస్ అయ్యారుగా..

Published : Feb 15, 2022, 04:57 PM IST

Bitter Gourd: కాకరకాయ కూరంటే గిట్టని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఎందుకో తెలుసా.. అది చేదుగా ఉంటది కాబట్టి. కానీ ఈ కాకరకాయనే మన పాలిట ఆరోగ్య దేవత. ఈ కాకరకాయ కూరను తినడం వల్ల ఎన్నోప్రయోజనాలు జరుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
13
Bitter Gourd: చేదుగా ఉంటదని కాకరకాయ కూరను తినడం లేదా? ఛా.. మీరెన్నోప్రయోజనాలను మిస్ అయ్యారుగా..

Bitter Gourd: చేదుగా ఉంటుందని కాకరకాయ కూరను తినని వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ చేదే మనకు ఆరోగ్యానిచ్చే దేవత. ఈ కాకరకాయను తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలిస్తే వీటిని అస్సలు వదిలిపెట్టరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాకరకాయను ఉడికించి తిన్నా, ఫ్రై చేసినా, జ్యూస్ గా తీసుకున్నా మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో అందుతాయి. అంతేకాదు ఇవి మన శరీరానికి ఎంతో మేలు కూడా చేస్తాయి. అలాగే ఇవి మన రోగ నిరోధక శక్తి ( Immunity) పెంచుతాయి. అలాగే బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. 
 

23

ఈ కాకరకాయలను వర్షాకాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అందులో ఉండే Antioxidants మనల్ని అనేక రోగాల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు వీటిని తరచుగా తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దాంతో మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం లేదు. అంతేకాదు ఇందులో ఉండే Antioxidants మన బాడీలో ఉండే ట్యాక్సిన్లు బయటకు పంపుతాయి. తద్వరా మన జీర్ణ వ్యవస్థ (Digestive system) బాగా పనిచేస్తుంది. అంతేకాదు బరువు కూడా కోల్పోతారు. ఈ కాకరకాయలో కొవ్వులు, క్యాలీరీలు, కార్బొహైడ్రేట్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి.
 

33

కాకరకాయ డయాబెటీస్ రోగులకు ఎంతో మంచిది. వారు కాకరకాయలను తినడం వల్ల వీటిలో ఉండే ఆల్కలైడ్లు Blood sugar levels తగ్గిస్తాయి. అంతేకాదు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు కాకరకాయలో ఉండే  Charntin peptides ఎంతగానో సహాయపడతాయి. రక్తాన్ని శుద్ది చేసేందుకు వీటిలో ఉండే Antioxidant, Antri microbial లు ఎంతో దోహదపడతాయి. కాకరకాయతో శ్వాస సంబంధిత రోగాలు, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. కాబట్టి కాకరకాయను తినని వారు ఇప్పటినుంచైనా తినండి. ఆరోగ్యంగా ఉంటారు.
 

Read more Photos on
click me!

Recommended Stories