Weight Gain Precautions: బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి..

Published : Feb 15, 2022, 03:36 PM IST

Weight Gain Precautions: వెయిట్ పెరగాలనుకునే వారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోకతప్పదు. వాటిని నెగ్లెట్ చేస్తే మాత్రం మీరు బరువు పెరగడం అనేది కలగానే మిగిలిపోతుంది మరి.. 

PREV
16
Weight Gain Precautions: బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి..

Weight Gain Precautions: కొంతమంది అధిక బరువుతో బాధపడితే.. మరికొంతమందేమో తక్కువ బరువుతో బాధపడుతున్నారు. తక్కువ వెయిట్ ఉన్నవారు బరువు పెరిగితే ఎంతబాగుంటుందోనంటూ కలలు కంటారు. నిజానికి హైట్ తగ్గ వెయిట్ లేకపోతే  Skelton లాగే కనిపిస్తారు. మరి సన్నగా ఉన్నవారు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా అనిపించరు. ముఖ్యంగా వారు చూడటానికి పుల్లలా అనిపిస్తారు. అలాంటి వారు నలుగురిలోకి వెళ్లాలంటేనే నామోషీగా ఫీలవుతుంటారు. 

26

తక్కువ వెయిట్ ఉన్న వాళ్లు బరువు పెరగాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వీరు అస్సలు తీసుకోకూడదు. మీరు తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉండేవాటినే తీసుకోవాలి. పోషకవిలువలు మెండుగా లభించే ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బలహీనమైన శరీరం, బలంగా తయారవ్వాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
 

36

జంక్ ఫుడ్ జోలికి వెల్లకండి:  బరువు పెరగడమే కాకుండా హెల్తీగా ఉండాలనుకుంటే మాత్రం జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కొంతమంది జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ పెరుగుతామని వాటినే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల బరువు పెరగడం పక్కాగా జరుగుతుంది. కానీ హెల్తీగా మాత్రం ఉండలేరు. ఈ జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల మీ ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. ఫలితంగా మీరు ఊబకాయం బారిన పడతారు. వీటికి బదులుగా కూరగాయలు, తాజా పండ్లను తినడం వీటి వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు మీరు అనుకున్న విధంగా బరువు పెరుగుతారు. 
 

46

ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి: బరువు పెరిగేందుకు బీర్ ఎంతో సహాయపడుతుందని కొందరు భావిస్తుంటారు. వాస్తవానికి ఇది నిజం కాదు. బీర్ లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ వీటిని తరచుగా తాగుతూ వ్యాయామాలు చేయకపోతే మాత్రం శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. అంతేకాదు దీనివల్ల మీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి మీకు పొట్ట వచ్చే ప్రమాదముంది. కాబట్టి బరువు పెరుగుతారని బీర్ ను తాగడం మానుకోండి. అలాగే కాఫీ, టీ లను కూడా తక్కువ మొత్తంలో తీసుకుంటేనే ఉత్తమం.
 

56

బరువు పెరిగేందుకు మొలకలు బాగా ఉపయోగపడతాయి. మొలకలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. అంతేకాదు ఇవి మీరు బరువు పెరిగేందుకు సహాయపడతాయి.

66

లావుగా ఉన్నవారికైనా, సన్నగా ఉన్నవారికైనా వ్యాయామాలు తప్పని సరి. సన్నగా ఉన్న వారు ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల వారికి ఆకలి పెరుగుతుంది. కాగా వీరు వ్యాయామం చేసే ఒక గంట ముందు, తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. 
 

click me!

Recommended Stories