బట్టతల మీద వెంట్రుకలొస్తాయి.. ఈ నూనెను వాడితే

First Published | Nov 30, 2024, 4:40 PM IST

హెయిర్ ఫాల్ సమస్య ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే చాలా మంది వెంట్రుకలు ఊడిపోయిన చోట కొత్త వెంట్రుకలు రానే రావని అనుకుంటారు. కానీ ఒక నూనెతో బట్టతలపై కూడా వెంట్రుకలు వస్తాయి. అదేం నూనె అంటే?

అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మందమైన, నల్లని జుట్టు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ చాలా మందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంటుంది. ఇలాంటి వారి బాధ మాటల్లో చెప్పలేం. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ వెక్కిరించండి, హేళన చేయడం లాంటివి చేస్తుంటారు. నిజానికి ఈ బట్టతల వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. 

బట్టతల రావాలని ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ పొల్యూషన్, జెనిటిక్స్, ఒత్తిడి, చెడు ఆహారాలు వంటి వివిధ కారణాల వల్ల బట్టతల వస్తుంటుంది. అయితే చాలా మంది జుట్టు రాలకుండా ఉండేందుకు నూనెలను, రకరకాల షాంపూలను మారుస్తుంటారు. 


 నిద్రలేమి, జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మందికి బట్టతల వస్తుంది. కొంతమంది అయితే జుట్టు రాలకుండా ఉండటానికి, జుట్టు ఒత్తుగా ఉండాలని వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయినా వెంట్రుకలు ఊడిపోవడం మాత్రం ఆగవు. కానీ ఒక నూనెతో జుట్టు రాలడం తగ్గి, కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. అదేం నూనో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జుట్టు రాలడానికి కారణాలు

అసలు జుట్టు రాలడం తగ్గాలంటే ముందు వెంట్రుకలు ఎందుకు ఊడిపోతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఈ కారణాన్ని గనుక మీరు తెలుసుకుంటే జుట్టు రాలడాన్ని ఈజీగా ఆపొచ్చు. కొంతమందికి హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు బాగా రాలిపోతుంది. ఇంకొంతమందికి శరీరంలో పోషకాలు లోపించడం, తగినంత నిద్రలేకపోవడం, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి బారిన ఎక్కువగా పడేవారికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. 

అలాగే శరీరంలో ఐరన్ వంటి ఖనిజాలు, విటమిన్ల లోపం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అలాగే పీసీఓడీ,థైరాయిడ్ సమస్య ఉన్నవారి శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉండవు. దీనివల్ల కూడా జుట్టు బాగా రాలుతుంది. అలాగే జుట్టు సంరక్షణ సరిగ్గా లేనివారికి కూడా బట్టతల వస్తుంది. జుట్టు పల్చగా అవుతుంది. 

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చిట్కాలు

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి రోజ్మేరీ నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ నూనెను పెట్టడం వల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో వెంట్రుకలు లేనిచోట కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. అయితే ఈ నూనెను మాత్రమే కాకుండా.. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవాలి. ఒక్క రోజ్మెరీ నూనెను మాత్రమే వాడటం మంచిది కాదు.

కొత్త వెంట్రుకలు రావడానికి ప్రతిరోజూ రాత్రిపూట రోజ్మెరీ నూనెను తలకు బాగా పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. రెగ్యలర్ గా ఇలా చేయడం వల్ల మీ నెత్తిమీద త్వరలోనే కొత్త వెంట్రుకలు వస్తాయి. 

రోజ్మేరీ నూనె ప్రయోజనాలు

రోజ్మేరీ నూనెలో ఎన్నో ఔషద లక్షణాలుంటాయి. ఈ నూనెను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. అలాగే జుట్టుకు మంచి పోషణ కూడా అందుతుంది. దీంతో మీ జుట్టు పొడుగ్గా, బలంగా పెరుగుతుంది.

ముఖ్యంగా ఈ రోజ్మెరీ నూనెను ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ నూనె మన జుట్టును వేర్ల నుంచి బలంగా చేస్తుంది. ఈ నూనెలో ఉండే విటమిన్లు మన జుట్టును వేర్ల నుంచి పెంచుతాయి.

ఇకపోతే ఈ నూనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును ఫంగస్, బ్యాక్టీరియా వంటి వాటితో పోరాడటానికి సహాయపడతాయి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల నెత్తిమీద చుండ్రు లేకుండా పోతుంది. అలాగే జుట్టును బలంగా చేసి జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 

Latest Videos

click me!