Rice Water vs Aloe Vera: బియ్యం నీళ్లు, అలోవెరాలో జుట్టు పెరగడానికి ఏది మంచిది? నిజాలు ఇవే!

Published : Jun 11, 2026, 01:16 PM IST

Rice Water vs Aloe Vera: జుట్టు ఆరోగ్యం కోసం సహజ పదార్థాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా రైస్ వాటర్, అలోవెరా హెయిర్ కేర్ అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ఈ రెండింటిలో జుట్టుకు నిజంగా ఏది ఎక్కువ మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

PREV
15
రైస్ వాటర్, అలోవెరాలో జుట్టుకు ఏది మంచిది?

ఇటీవలి కాలంలో జుట్టు ఆరోగ్యం కోసం సహజ పదార్థాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా బియ్యం నీళ్లు, అలోవెరాలను జుట్టు సంరక్షణలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండింటిలో నిజంగా జుట్టుకు ఏది ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం ఈ రెండింటికీ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

25
బియ్యం నీళ్ల ప్రయోజనాలు

రైస్ వాటర్‌లో అమైనో యాసిడ్లు, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఇనోసిటోల్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. పరిశోధనల ప్రకారం ఇనోసిటోల్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం, జుట్టు చిట్లకుండా కాపాడటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఫెర్మెంటెడ్ రైస్ వాటర్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించడం వల్ల జుట్టు సాఫ్ట్ గా, స్మూత్ గా మారే అవకాశం ఉంది.

35
అలోవెరా ప్రయోజనాలు

అలోవెరాలో విటమిన్ ఎ, సి, ఈ, బి12, ఫోలిక్ యాసిడ్ సహా అనేక ఎంజైమ్‌లు ఉంటాయి. నిపుణుల ప్రకారం అలోవెరా తల చర్మాన్ని తేమగా ఉంచడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. జుట్టు పొడిబారడం, దురద, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలోవెరాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్‌ను ప్రశాంతంగా ఉంచుతాయి. ఫలితంగా జుట్టు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారికి అలోవెరా మంచి ఎంపిక.

45
రైస్ వాటర్, అలొవెరాలో ఏది బెస్ట్?

నిపుణుల ప్రకారం జుట్టు విరిగిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటే రైస్ వాటర్ కొంత మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు తంతువులను బలపరచడంలో సహాయపడతాయి. అయితే చుండ్రు, తల దురద, స్కాల్ప్ ఇరిటేషన్ వంటి సమస్యలు ఉంటే అలోవెరా మంచి ఎంపిక.

55
ఈ విషయాలు మర్చిపోవద్దు..

నిపుణుల ప్రకారం రైస్ వాటర్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల కొంతమందిలో జుట్టు గట్టిగా మారడం లేదా ప్రోటీన్ బిల్డ్-అప్ సమస్యలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా లో-పోరోసిటీ హెయిర్ ఉన్నవారు రైస్ వాటర్ ని ఎక్కువగా వాడటం మంచిదికాదు. అలాగే అలోవెరా సాధారణంగా సురక్షితమైనదే అయినప్పటికీ, కొందరిలో అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. అలాగే వారానికి ఒకసారి రైస్ వాటర్‌తో జుట్టును కడిగి, మరోసారి అలోవెరా జెల్‌ను హెయిర్ మాస్క్‌లా ఉపయోగించడం ద్వారా రెండు పదార్థాల ప్రయోజనాలను పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories