నవరాత్రులు మొదలయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ దేవీ నవరాత్రులను ఆనందంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులు... తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ప్రజలు పూజ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ 25 న వస్తుంది. ఈ రోజున మా దుర్గ తన ఉనికితో భూమిని దయ చేస్తుందని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శారదియ నవరాత్రులు సెప్టెంబర్ 26, 2022 నుండి ప్రారంభమవుతాయి. 4 అక్టోబర్ 2022 వరకు కొనసాగుతాయి. తరువాత రావణ్ దహన్ ఉంటుంది. నవరాత్రి సంబరాల్లో చాలా మంది భక్తులు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో.. చేయాల్సినవీ, చేయకూడనివీ ఏంటో ఓసారి చూద్దాం..
నవరాత్రులలో అస్సలు తినకూడని ఆహారాలు
భారతీయ పండుగలలో ఆహారాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఉపవాసం, విందు రెండూ కలిసి ఉంటాయి. ఈ 9 రోజులలో మీరు పాటించాల్సిన కొన్నిఆహారాలు, ఉపవాస నియమాలు ఇక్కడ ఉన్నాయి:
రెగ్యులర్ స్టేపుల్స్ బియ్యం, గోధుమలు లేదా శుద్ధి చేసిన పిండి వంటి ధాన్యాలను నివారించండి. 9 రోజుల ఉపవాస సమయంలో కుట్టు కా అట్ట (బుక్వీట్ అట్ట), సింగరే కా అట్ట (వాటర్ చెస్ట్‌నట్ పిండి), సబుదానా, సంవత్ (బార్న్యార్డ్ మిల్లెట్) లేదా ఉసిరి వంటివి తినవచ్చు.
పండ్లు..
నవరాత్రుల ఈ 9 రోజులలో అన్ని పండ్లను ఆస్వాదించవచ్చు. వీటిని ప్రసాదంగా కూడా తినవచ్చు. అన్ని పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు.
ఉప్పు, మసాలా...
రుచికరమైన వంటకాలు, ప్రసాదం వంటకాలకు ఉప్పు, మసాలా లాంటివి ఉపయోగిస్తాం. కానీ.. ఉప్పు, మసాలాలు దూరంగా ఉండాలి. ఉప్పును సేంద నమక్‌తో భర్తీ చేయవచ్చు. ఘాటు మసాలాకు దూరంగా ఉండి.. జీలకర్ర లాంటివి వాడటం ఉత్తమం.
నూనె
ఈ 9 రోజులలో, ఆవనూనె మరియు నువ్వులు వాడటం మానేయాలి, బదులుగా వేరుశెనగ నూనె లేదా నెయ్యి వాడాలి.
పాలు, పాల ఉత్పత్తులు
పాలు, పాల ఉత్పత్తులను ప్రసాదాలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. వీటిని తినవచ్చు.
కూరగాయలు
ఈ సమయంలో బంగాళదుంపలు, చిలగడదుంపలు, నిమ్మకాయలు వంటి కూరగాయలను ఆస్వాదించవచ్చు.
పూజ చేయాల్సిన సమయంలో... చేయాల్సినవీ, చేయకూడనివీ:
పూజ ప్రారంభించడానికి, తెల్లవారుజామున నిద్రలేచి, పవిత్ర స్నానం ఆచరించి, పూజా స్థలాన్ని శుభ్రపరచడం, అలంకరించడం తప్పనిసరి.
ఆరతి తరువాత పూజానంతరం భక్తులు దేవుడికి ప్రసాదం సమర్పించవచ్చు. వారి సంకల్పం ప్రకారం వారు వ్రత ఆహారాలు లేదా పండ్లను తీసుకోవచ్చు.
ఈ రోజుల్లో గోళ్లు చిట్లడం లేదా జుట్టు కత్తిరించడం వంటివి మానుకోండి.
చివరగా, భక్తులు పగటిపూట నిద్రకు దూరంగా ఉండాలి.
గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండకూడదు.